ఆవిరి – టీజర్ 1

ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు నటిస్తూ, నిర్మిస్తున్న 'ఆవిరి' టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 28, 2019 / 04:28 AM IST
ఆవిరి – టీజర్ 1

Updated On : September 28, 2019 / 4:28 AM IST

ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు నటిస్తూ, నిర్మిస్తున్న ‘ఆవిరి’ టీజర్ రిలీజ్..

ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్ హారర్, థ్రిల్లర్‌తో ఆడియన్స్‌ను భయపెట్టబోతున్నాడు. ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును’ సినిమాలతో ఆకట్టుకున్న రవిబాబు ప్రస్తుతం ‘ఆవిరి’ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నటిస్తూ, నిర్మిస్తున్నాడు. నేహా చౌహాన్, శ్రీ ముఖ్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘ఆవిరి’ టీజర్ రిలీజ్ చేశారు.

‘ఈ ఇంట్లో రాజ్ కుమార్ రావు అతని ఫ్యామిలీ నివసిస్తుంది. వారితో పాటు ఒక ఆత్మ కూడా ఉంది.. దానిని మీరు కనిపెట్టగలరా’? అనే టెక్ట్స్‌తో స్టార్ట్ అయిన ‘ఆవిరి’ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆత్మ కుర్చీలాక్కోవడం, గ్లాస్‌లో జ్యూస్ పోసుకోవడం, మనిషి కనిపించకుండా కేవలం షూస్ మాత్రమే నడవడం, బాత్‌టబ్‌లో పొగలు రావడం, అందులో నుండి సడెన్‌గా ఓ చెయ్యి బయటకి రావడం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Read Also : ‘సామజవరగమన – నినుచూసి ఆగగలనా’..

ఫస్ట్‌లుక్‌తోనే ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచాడు. గతచిత్రం ‘అదుగో’ నిరాశపరచడంతో ‘ఆవిరి’పై బాగా ఫోకస్ చేసినట్టున్నాడు. సినిమాటోగ్రఫీ : ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్ : వైధీ, ఫైట్స్ : సతీష్, ఆర్ట్ : నారాయణ రెడ్డి, స్క్రీన్‌ప్లే : సత్యానంద్, కథ, నిర్మాత, దర్శకత్వం : రవిబాబు.