×
Ad

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!

రవితేజ 71వ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’..

  • Published On : November 3, 2021 / 12:27 PM IST

Tiger Nageswarara Rao

Raviteja 71: మాస్ మహారాజా రవితేజ జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. ‘ఖిలాడి’ కంప్లీట్ చేసి, ‘రామారావ్ – ఆన్ డ్యూటీ’ తో పాటు త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’ చేస్తున్నారు. సుధీర్ వర్మతో 70వ సినిమా ఇటీవలే అనౌన్స్ చేశారు.

Ravi Teja 70 : ‘రావణాసుర’ గా రవితేజ

కట్ చేస్తే ఇప్పుడు 71వ సినిమా కూడా ప్రకటించేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాను ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్నారు.  ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది.

Bheemla Nayak : ‘లాలా.. ఊరమాస్ భీమ్లా’..

రవితేజ కెరీర్‌లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది.

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!

కొంత గ్యాప్ తర్వాత యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్న తెలుగు సినిమా ఇదే. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ స్టార్ట్ కానుంది.