Eagle Trailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ వచ్చేసింది..

రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Eagle Trailer : మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఈగల్’. ఈ సినిమాలో కావ్య తపర్ హీరోయిన్ గా నటిస్తుంటే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన మూవీ టీం.. ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ యాక్షన్ కట్ తో అదిరిపోయింది. రవితేజ మాస్ అండ్ క్లాస్ లుక్స్ లో వావ్ అనిపిస్తున్నారు.

“ఆయుధాలతో యుద్ధం చేసేవాడు రాక్షుసుడు అవుతాడు. ఆయుధాలతో యుద్ధం ఆపేవాడు దేవుడు అవుతాడు” అనే డైలాగ్ తో మూవీ స్టోరీ లైన్ ని తెలియజేశారు. ట్రైలర్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇక విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఈ ట్రైలర్ తో మూవీ పై మంచి హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో ఏ సందేహం లేదు. మరి ఆ ట్రైలర్ ని ఒకసారి మీరును చూసేయండి.

Also read: SeshEXShruti : అడివి శేష్, శ్రుతి హాసన్ మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.. దోపిడి దొంగల ప్రేమ కథ..