Ravikrishna : నవ్యస్వామితో రిలేషన్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ.. తనొచ్చి ప్రపోజ్ చేస్తే?

ప్రస్తుతం రవికృష్ణ విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో నవ్యస్వామి గురించి మాట్లాడాడు.

Ravikrishna gives clarity on relation with Navya Swamy

Ravikrishna :  నవ్యస్వామి, రవికృష్ణ.. సీరియల్ యాక్టర్స్ అయినా మంచి పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కలిసి పలు హిట్ సీరియల్స్ లో నటించడంతో వీరిది హిట్ పెయిర్ అయింది. ఈ పెయిర్ కి అభిమానులు కూడా ఉన్నారు. ఇక నవ్యస్వామి, రవికృష్ణ ఇద్దరూ కూడా వేరు వేరు సీజన్స్ లో బిగ్ బాస్ షోలో పాల్గొని అలరించారు. ఆ షోతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.

బిగ్ బాస్ షో తర్వాత ఈ పెయిర్ మీద జనాల ఫోకస్ మరింత ఎక్కువైంది. టీవీ షోలలో కూడా వీరిద్దర్నీ పిలిచేవాళ్ళు. జంటగా పలు టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. గతంలో కూడా ఈ వార్తలపై నవ్యస్వామి, రవికృష్ణ స్పందిస్తూ మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇక వీళ్ళు బయట కూడా కలిసి తిరగడం, వీడియోలు, ఫొటోషూట్స్ చేయడంతో నిజంగానే ఈ జంట ప్రేమలో ఉందని అంతా అనుకున్నారు. తాజాగా వీరి రిలేషన్ పై మరోసారి రవికృష్ణ క్లారిటీ ఇచ్చాడు.

రవికృష్ణ ఇటీవలే విరూపాక్ష సినిమాలో నటించి అందర్నీ మెప్పించాడు. అసలు రవికృష్ణ ఇలాంటి పర్ఫార్మర్ అని ఎవ్వరికి తెలియకపోవడంతో సినిమాలో అతని క్యారెక్టర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో రవికృష్ణకి మంచి పేరుతో పాటు ఛాన్సులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం రవికృష్ణ విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో నవ్యస్వామి గురించి మాట్లాడాడు.

Samantha : నా ఫేవరేట్ యాక్టర్ అంటూ.. విజయ్ దేవరకొండకు సమంత స్పెషల్ బర్త్ డే విషెష్..

రవికృష్ణ మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం సీరియల్స్ చెయ్యట్లేదు. నా లాస్ట్ సీరియల్ తనతోనే. ఆ తర్వాత మళ్ళీ ఇంకే సీరియల్ చేయలేదు. టీవీ షోస్ లో రేటింగ్ కోసం పెయిర్స్ కావాలి కాబట్టి మాకు కొంచెం ఫేమ్ ఉందని ఎక్కువగా మా పెయిర్ ని పిలిచేవాళ్ళు. అలా మరింత పాపులర్ అయ్యాము. మా మీద వచ్చే వార్తలు ఇద్దరం చూస్తాం. చూసి వదిలేస్తాం. మాకు అయితే పెళ్లి మీద ఆలోచన లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ గా తనంటే ఇష్టం ఉంది అని అన్నాడు. అయితే యాంకర్.. ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు అని అడగ్గా.. అసలు అలా జరగదు. ఒకరంటే ఒకరికి ఫ్రెండ్ అనే ఇష్టం ఉంది అంతే. ఒకవేళ అలా జరిగినప్పుడు అప్పుడు చూద్దాం అని తెలిపాడు రవికృష్ణ.