Ravikula Raghurama : ‘రవికుల రఘురామ’ మూవీ రివ్యూ.. రెగ్యులర్ ప్రేమకథే అయినా మెప్పించిందా?

రవికుల రఘురామ సినిమా ఓ ప్రేమకథగా మదర్ సెంటిమెంట్ తో సాగుతుంది.

Ravikula Raghurama : ‘రవికుల రఘురామ’ మూవీ రివ్యూ.. రెగ్యులర్ ప్రేమకథే అయినా మెప్పించిందా?

Ravikula Raghurama new age love story movie review and rating

Ravikula Raghurama : గౌతమ్ వర్మ, దీప్షిక జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రవికుల రఘురామ’. పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీధర్ వర్మ తెరకెక్కించిన ఈ ప్రేమకథా సినిమా నేడు మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. ఓ మంచి అబ్బాయి గౌతమ్(గౌతమ్ వర్మ) నిషా(దీప్షిక) అనే అమ్మాయిని చూడటంతోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి ప్రేమ కోసం తన వెనకే తిరుగుతాడు. మొత్తానికి నిషా గౌతమ్ ప్రేమలో పడుతుంది. అక్కడ్నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతారు. కానీ అనుకోని కారణాలతో నిషా గౌతమ్ ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దీంతో గౌతమ్ పిచ్చోడిలా అయిపోతాడు. గౌతమ్ ని ఆలా చూసి అతని తల్లి తట్టుకోలేకపోతుంది. అసలు నిషా గౌతమ్ ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? గౌతమ్, నిషా మళ్ళీ కలిసారా? గౌతమ్ ప్రేమ కోసం వాళ్ళ అమ్మ ఏం చేసింది అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. వెండితెరపై ప్రేమకథలు కొత్తేమి కాదు. ఇది కూడా అలాంటి ఓ ప్రేమ కథా చిత్రమే. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ ని చూడటం, ప్రేమలో పడటం, ఆమె వెనక తిరగడం, ఇద్దరూ కలిసి ప్రేమించుకోవడం.. ఇలా సాగుతుంది. నిషా గౌతమ్ ని వదిలేసి వెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా కలుసుకుంటారు అని కొంచెం ఆసక్తితో సాగుతుంది. సినిమాలో కొన్ని ట్విస్ట్ లు కూడా ఉండటం గమనార్హం. కాకపోతే ఈ ప్రేమ కథకి కాస్త మదర్ సెంటిమెంట్ తోడయింది. తల్లి ప్రేమ, ప్రియురాలి ప్రేమ.. ఎమోషన్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రేమ సినిమాల్లో ఉండే డైలాగ్స్ తెలిసిందే. అలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి. సినిమా అక్కడక్కడా కాస్త బోర్ కొడుతుంది.

నటీనటుల విషయానికొస్తే.. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్లే. గౌతమ్ వర్మ ప్రేమికుడిగా వెంటపడటం, బ్రేకప్ తర్వాత బాధపడటం.. రెండు వేరియేషన్స్ లోను మెప్పించాడు. దీపశిక నటనతో పాటు అందంతోను మెప్పించింది. సత్య, జబర్దస్త్ నాగి.. పలువురు నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక విషయాలు.. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ముఖ్యంగా పాటలు అడవులు, బీచ్ ల వద్ద తీయడంతో లొకేషన్స్ ని అందంగా చూపించారు. పాటలు యావరేజ్ గా అనిపించినా ప్రేమ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఓకే అనిపిస్తుంది. రెగ్యులర్ కథ కావడంతో అక్కడక్కడా బోర్ కొట్టినా ప్రేమ సన్నివేశాలతో సాగిపోతుంది. కొత్త దర్శకుడు చంద్రశేఖర్ మొదటి సినిమాతో ఓకే అనిపించాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా రవికుల రఘురామ సినిమా ఓ ప్రేమకథగా మదర్ సెంటిమెంట్ తో సాగుతుంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.