Raviteja 75 : రవితేజ 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఈసారి తెలంగాణ స్లాంగ్ తో.. రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా రవితేజ 75వ సినిమాని నేడు ఉగాది సందర్భంగా ప్రకటించారు.

Raviteja 75th Movie Announced in Sithara Entertainments on Ugadi

Raviteja 75 : మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. ఇటీవల వచ్చిన ఈగల్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజయిపోతుంది. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. తాజాగా రవితేజ 75వ సినిమాని నేడు ఉగాది సందర్భంగా ప్రకటించారు.

‘సామజవరగమన’ రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు రవితేజ. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈసారి పక్కా తెలంగాణ స్లాంగ్ తో రవితేజ రాబోతున్నట్టు పోస్టర్ లో చూపించేసారు. హ్యాపీ ఉగాది రా భయ్.. రవన్న దావత్ ఇస్తున్నాడు, రెడీ అయిపోండి అని రవితేజ 75వ సినిమాని ప్రకటించారు.

Also Read : Love Mouli Trailer : నవదీప్ కొత్త అవతారంతో.. ‘లవ్ మౌళి’ ట్రైలర్ చూశారా.. ఎంతమంది అమ్మాయిలతో ప్రేమ..?

ఇక ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే సంక్రాంతి 2025కి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దిల్ రాజు కూడా వాళ్ళ సినిమాలని అనౌన్స్ చేశారు. ఆ బరిలో ఇప్పుడు రవితేజ కూడా చేరాడు. మరి చివరివరకు సంక్రాంతి 2025 బరిలో ఎవరి సినిమాలు ఉంటాయో చూడాలి.