TG Vishwa Prasad : ‘ఈగల్’ నిర్మాత వైరల్ ట్వీట్.. అవినీతి గురించి మాట్లాడుతుంటే.. వారెందుకు భుజాలు తడుముకుంటున్నారు..

రవితేజ 'ఈగల్' మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ వైరల్ ట్వీట్ చేశారు. అవినీతి గురించి మాట్లాడుతుంటే, వారెందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ..

Raviteja Eagle Movie Producer TG Vishwa Prasad viral tweet on corruption in industry

TG Vishwa Prasad : సాఫ్ట్‌వెర్ ఫీల్డ్ నుంచి సినిమా నిర్మాణం వైపు వచ్చిన నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టాలీవుడ్ లోని బడా హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ముప్పైకి పైగా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం మరో పాతిక చిత్రాలను లైనప్ లో ఉంచారు. నేడు ఈ నిర్మాణం సంస్థ నుంచి ‘ఈగల్’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది.

రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత విశ్వ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తన ప్రొడక్షన్ హౌస్‌లో జరిగిన అవినీతి చర్యల వలన తమ చిత్రాల్లో క్వాలిటీ ఎలా దెబ్బ తిన్నదో, ఇక దానిని ఎదుర్కొనే ప్రయత్నంలో తాను ఎలాంటి ప్రతిచర్యలు తీసుకున్నారో చెప్పుకొచ్చారు.

Also read : Chiranjeevi : ఇంటర్నేషనల్ అవార్డుల్లో మరోసారి ఇండియా మ్యూజిషన్స్ రీసౌండ్.. చిరు అభినందన ట్వీట్..

అయితే నిర్మాత చేసిన ఈ కామెంట్స్ పై కొందరు పరిశ్రమ వ్యక్తులు స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలను వక్రీకరించి కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్టు దుష్ప్రచారం చేస్తున్నారట. ఇక ఈ విషయం పై విశ్వ ప్రసాద్ అసహనం వ్యక్తం చేస్తూ వైరల్ ట్వీట్ చేశారు. అవినీతి గురించి మాట్లాడుతుంటే వారెందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ ప్రశ్నించారు.

ఆ ఇంటర్వ్యూలో తాను అన్నది.. ‘పరిశ్రమలోని కొందరు అవినీతిపరుల వల్ల తన డబ్బు కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకు అందడం లేదని’ వ్యాఖ్యానించినట్లు విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు. అయినా తన కంపెనీలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతుంటే బయటి వారికి సంబంధమేమిటో తనకి అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. తాను సినిమా పై ఇష్టంతో నిర్మాణంలోకి వచ్చినట్లు ఇంకొకరి కష్టాన్ని దోచుకోవడం కోసం కాదని చెప్పుకొచ్చారు.