Raviteja Interesting Comments on his Life Biopic in Tiger Nageswara Rao Movie Promotions
Raviteja : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) దర్శకుడు వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswararao). అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్రకాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.
పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. రవితేజ అయితే బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోషన్స్ చేస్తూ అక్కడి ఛానల్స్, సైట్స్, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవితేజ లైఫ్ బయోపిక్ చేయాల్సివస్తే అని ప్రశ్న అడగగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
రవితేజ తన బయోపిక్ పై స్పందిస్తూ.. ఒకవేళ నా బయోపిక్ వస్తే కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉంటుంది. నా బయోపిక్ లో నేనే నటిస్తాను అని తెలిపాడు. అయితే బయోపిక్ టైటిల్ అని అడగా అక్కడ ఉన్న కొంతమంది మాస్ మహారాజ అని అరిచారు. రవితేజ కూడా తన బయోపిక్ తీస్తే మాస్ మహారాజ టైటిల్ పెడతాను అని తెలిపాడు. దీంతో రవితేజ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Sreeleela : భగవంత్ కేసరి టైంలో మెడిసిన్ ఎగ్జామ్స్.. బాలయ్యతో మెడికల్ సబ్జెక్ట్ డిస్కషన్..
సినీ పరిశ్రమకి ఒక్కడిగా వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ హీరోగా మారి స్టార్ హీరోగా ఎదిగి మాస్ మహారాజగా రవితేజ ఎదిగిన జర్నీ ఎంతోమందికి స్ఫూర్తి. రవితేజకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వేరే హీరోల అభిమానులు కూడా రవితేజని అభిమానిస్తారు. మరి నిజంగానే రవితేజ ఎమోషనల్, ఇన్స్పిరేషనల్ జర్నీ బయోపిక్ గా వస్తుందేమో చూడాలి.