Raviteja : బాలీవుడ్ యువ హీరోతో రవితేజ మల్టీస్టారర్? తెలుగు డైరెక్టర్ తో సినిమా..
ఇటీవల నానితో ఓ ఇంటర్వ్యూ చేయగా అందులో కూడా నానితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని చెప్పాడు రవితేజ. తాజాగా రవితేజ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. రవితేజ మరో మల్టీస్టారర్ కి ఓకే చెప్పినట్టు సమాచారం.

Raviteja Multi starer with Varun Dhawan in Bollywood
Raviteja : ఇటీవల మల్టీస్టారర్స్(Multi Starers) ఎక్కువైనా సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్స్ కి ఓకే చెప్తున్నారు. ఒకేసారి ఇద్దరి హీరోలు పెట్టడంతో సినిమా బడ్జెట్ పెరిగి, మార్కెట్ కూడా పెరుగుతుండటంతో నిర్మాతలు కూడా మల్టీస్టారర్స్ కి ఓకే చెప్తున్నారు. వరుసగా ఇటీవల మల్టీస్టారర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాస్ మహారాజ(Mass Maharaja) రవితేజ(Raviteja) కూడా ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) కలిసి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలో నటించి మల్టీస్టారర్స్ కి రెడీ అని చెప్పేశాడు.
రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు, ఇప్పుడు రావణాసుర సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇటీవల నానితో ఓ ఇంటర్వ్యూ చేయగా అందులో కూడా నానితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని చెప్పాడు రవితేజ. తాజాగా రవితేజ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. రవితేజ మరో మల్టీస్టారర్ కి ఓకే చెప్పినట్టు సమాచారం.
Also Read : Agent : అఖిల్ ఏజెంట్ మళ్ళీ వాయిదా పడుతుందా? ఇంకా షూటింగ్ మిగిలే ఉందా?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి రవితేజ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని తెలుగు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రానా నిర్మాణంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ్ లో శింబు, SJ సూర్య నటించిన మానాడు సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కబోతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు రాగా ఇది వైరల్ గా మారింది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. మరి నిజంగానే రవితేజ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో మల్టీస్టారర్ సినిమా చేసి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.