Agent : అఖిల్ ఏజెంట్ మళ్ళీ వాయిదా పడుతుందా? ఇంకా షూటింగ్ మిగిలే ఉందా?

ఇటీవల ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఏజెంట్ షూటింగ్ మరో 20 రోజులు చేస్తేనే కానీ కంప్లీట్ కాదని సమాచారం.

Agent : అఖిల్ ఏజెంట్ మళ్ళీ వాయిదా పడుతుందా? ఇంకా షూటింగ్ మిగిలే ఉందా?

Akhil Agent

Updated On : April 6, 2023 / 12:18 PM IST

Agent :  అఖిల్(Akhil) ఏజెంట్(Agent) మూవీ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. మొదట్లో ఓ రెండు సాంగ్స్ రిలీజ్ చేసి హడావిడి చేసినా ఆ తర్వాత మేకర్స్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. సినిమా రిలీజ్ కి ఇంకా 20 రోజులే టైం ఉన్నా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు, అసలు ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదని టాక్ వినిపిస్తుంది.

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. అంతకు ముందే ఈ మూవీ రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఇంతకాలం పాటు షూట్స్ అండ్ రీషూట్స్ వల్ల బడ్జెట్ కూడా భారీగా పెరిగింది.

Image

ఇటీవల ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఏజెంట్ షూటింగ్ మరో 20 రోజులు చేస్తేనే కానీ కంప్లీట్ కాదని సమాచారం. అందుకే మూవీ గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్. రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ సినిమాపై అసలే మాత్రం బజ్ లేకపోవడం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతూనే మరో వైపు షూటింగ్ కూడా సురేందర్ రెడ్డి పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.

Tiger Vs Pathaan : వార్ డైరెక్టర్ తో టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా.. వరుస అప్డేట్స్ తో YRF స్పై యూనివర్స్.. ఖుషీలో ఫ్యాన్స్..

అందుకే ఏప్రిల్ 28 అనుకున్న సినిమా విడుదల మళ్లీ వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తోన్న సినిమా ఇధి. ఇందులో అఖిల్ మంచి మేకోవర్ చేసి పవర్ ఫుల్ బాడీతో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ఫిజికల్ గా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అఖిల్. ఈ సినిమాపై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ యాక్షన్ హీరోగా, భారీ బడ్జెట్ తో ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా అనుకున్న టైమ్ లోనే రిలీజ్ అవుతుందో లేక వాయిదా పడుతుందో చూడాలి.