Changure Bangaru Raja : ఛాంగురే బంగారు రాజా.. కథ ఒకటే.. కథనాలే ఎన్నో.. రవితేజ నిర్మాతగా సక్సెస్ అయ్యాడా?

ఒక కథని వేరే వేరే వ్యక్తుల కోణంలో చూపించే విధానంలో ఈ సినిమాని తెరకెక్కించారు. హత్య చుట్టూ ఉండే వ్యక్తులు, వాళ్ళ కోణం నుంచి సినిమా సాగుతుంది.

Raviteja Producing Movie Changure Bangaru Raja Movie Review and Ratings Satya comedy worked well

Changure Bangaru Raja Review :  మాస్ మహారాజ రవితేజ (Raviteja) హీరోగా ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క నిర్మాతగా కూడా వరుస చిత్రాలను నిర్మిస్తున్నాడు. తన RT టీమ్ వర్క్స్ (RT Team Works) నిర్మాణ సంస్థలో కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. సతీష్ వర్మ దర్శకత్వంలో కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం(Karthik Ratnam), రవిబాబు(Ravibabu), సత్య(Satya), ఎస్తర్ నోరాన్హా, గోల్డీ నిస్సీ, నిత్యశ్రీ.. పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా ఛాంగురే బంగారు రాజా. నేడు సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికి వస్తే.. వర్షం పడితే వజ్రాలు దొరుకుతాయని అనుకునే ఓ ఊళ్ళో హీరో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. వజ్రాల విషయంలో ఓ వ్యక్తితో గొడవ పెట్టుకోగా అతను చనిపోవడంతో హీరోనే హత్య చేశాడని అందరూ భావిస్తారు. పోలీసులు కూడా విచారణకు హీరోని అరెస్ట్ చేస్తారు. బెయిల్ మీద బయటకి వచ్చిన హీరో అతన్ని ఎవరు హత్య చేశారో కనుక్కునే ప్రాసెస్ లో హీరోని కూడా హత్య చేయడానికి ప్రయత్నిస్తారని తెలుస్తుంది. దీంతో హీరో హత్య చేసిన వాళ్ళని ఎలా పట్టుకున్నాడు, హీరోని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు, ఈ మధ్యలో హీరో – పోలీస్ కానిస్టేబుల్, సత్య – నిత్యశ్రీ లవ్ స్టోరీలు సరదాగా ఉంటాయి.

Mark Antony Review : మార్క్ ఆంటోనీ రివ్యూ.. టైం ట్రావెల్ ఫోన్‌తో జీవితాలు మార్చేసుకున్నారుగా.. SJ సూర్య నట రాక్షసత్వం..

సినిమాకి సత్య చాలా ప్లస్ అవుతాడు. సత్య – నిత్య లవ్ స్టోరీ కామెడీగా సాగుతుంది. సినిమాలో కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఒక కథని వేరే వేరే వ్యక్తుల కోణంలో చూపించే విధానంలో ఈ సినిమాని తెరకెక్కించారు. హత్య చుట్టూ ఉండే వ్యక్తులు, వాళ్ళ కోణం నుంచి సినిమా సాగుతుంది. స్క్రీన్ ప్లే అద్భుతంగా సాగుతుంది. ప్రతి కోణంలోంచి కథని చూపించి కరెక్ట్ గా కనెక్ట్ చేశాడు దర్శకుడు. ఇలాంటి కథతో పలు సినిమాలు వచ్చినా తక్కువ బడ్జెట్ లో రవితేజ మంచి ఎంటర్టైనింగ్ గా సాగే సినిమానే నిర్మించాడు.