Raviteja Voice over for Sivakarthikeyan Mahaveerudu movie
Mahaveerudu : తమిళ్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రం ‘మహావీరుడు’. మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా శివ కార్తికేయన్ తన సోషల్ మీడియా ద్వారా మరో వీడియోని రిలీజ్ చేశారు.
Rashmika : రష్మిక ఎన్ని భాషల్లో మాట్లాడగలదో మీకు తెలుసా..? ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..?
ఆ వీడియోలో శివ కార్తికేయన్ తన చెవిలో మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) వాయిస్ వినిపిస్తోందని చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏంటని ఆలోచిస్తున్నారా..? విషయం ఏంటంటే.. ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో రవితేజ ఈ సినిమాలో శివ కార్తికేయన్ తో ఆకాశవాణిగా మాట్లాడబోతున్నాడు. ఆ మాటలు కేవలం శివ కార్తికేయన్ కి మాత్రమే వినిపిస్తుంటాయి. ఆ వాయిస్ ఎలా చెబితే అలా చేస్తుంటాడు. ఈ వీడియోతో మూవీ పై మరింత ఆసక్తిని కలగజేశారు మేకర్స్.
Tamannaah : అభిమానితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో తమన్నా డాన్స్.. వీడియో వైరల్..
. @RaviTeja_offl Sir It’s a great pleasure to have your energetic voice in our film and thank you so much for your support to the #Mahaveerudu team sir ???
– Sivakarthikeyan #MahaveeruduFromJuly14th #DhairiyameJeyam pic.twitter.com/682YdgVe7B— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 11, 2023
కాగా రవితేజ గతంలో ‘మర్యాద రామన్న’ సినిమా సమయంలో సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అది ఆడియన్స్ ని బాగా అలరించింది. ఇప్పుడు ఈ సినిమాలో రవితేజ తన వాయిస్ తో ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక తమిళంలో విజయ్ సేతుపతి ఆ వాయిస్ ఓవర్ ని అందిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో మిస్కిన్, యోగి బాబు, సునీల్, సరితా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు.