అక్టోబర్ 11న RDX Love
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల జంటగా నటించిన ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. 'RDX Love'.. అక్టోబర్ 11న విడుదల కానుంది..

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల జంటగా నటించిన ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘RDX Love’.. అక్టోబర్ 11న విడుదల కానుంది..
ఆర్ఎక్స్ 100తో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, హుషారు ఫేమ్, తేజస్ కంచెర్ల జంటగా, G.రామ్ మునీష్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘RDX Love’.. శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముమైత్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది.
ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మూవీలో తేజస్, పాయల్ కెమిస్ట్రీతో పాటు కంటెంట్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న RDX Love చిత్రాన్ని అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చెయ్యనున్నారు.
నరేష్, నాగినీడు, ఆదిత్య మీనన్, తులసి, ఆమని, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : రథన్, కెమెరా : C.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, కో-ప్రొడ్యూసర్ : సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిన్నా.