ఎన్నికల కోడ్ వచ్చేసింది.. ప్రభుత్వాలు, పార్టీలు ఇష్టానుసారం చేయటం కుదరదు. ఏ పని చేయాలన్నా కండీషన్స్ అప్లై. ప్రజలను ప్రలోభాలకు గురి చేయకూడదు. డబ్బులు పంచకూడదు. ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. ఏ పని చేయాలన్నా ఎన్నికల కమిషన్ పర్మీషన్ తీసుకోవల్సిందే. ఈసారి నిబంధనలు మరింద కఠినతరం అయ్యాయి. చివరకు సోషల్ మీడియాపైన కూడా ఈసీ ఆంక్షలు పెట్టింది. ఇలాంటి టైంలో.. త్వరలో రాబోతున్న లక్ష్మీస్ NTR మూవీ గురించి వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతోంది. ఎన్టీఆర్ జీవితచరిత్రను లక్ష్మీ పార్వతి కోణంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ NTR సినిమా విడుదల ఆగవచ్చని అంటున్నారు.
లక్ష్మీస్ NTR మూవీకి కథ టీడీపీ రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం కథగా సినిమా తెరకెక్కుతుంది. ఇలాంటి స్టోరీతో వస్తున్న ఈ సినిమా.. మార్చి 22వ తేదీన రిలీజ్ అవుతుందా? లేదా? అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం.. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావటమే. దీనికితోడు ఏపీలో అసెంబ్లీ పోలింగ్ కూడా ఉంది. ఏప్రిల్ 11వ తేదీన ఓటింగ్ ఉంది.
పోలింగ్ కు సరిగ్గా 20 రోజుల ముందు.. అందులోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి మూవీ రిలీజ్ చేయవచ్చా.. లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందులోనూ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో టీడీపీ అభ్యంతరం చెబితే సినిమా విడుదల ఆగిపోతుందా? అనే సందేహాలూ ఉన్నారు. ఒకవేళ దియేటర్లలో సినిమాను విడుదల కానివ్వకుంటే వర్మ.. సోషల్ మీడియాలో విడుదల చేస్తాను అంటే కూడా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాపైనా ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధించింది. గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇన్ని సందేహాలకు సమాధానం దొరకాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.