Rebel Star Krishnam Raju has no more
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.1940 జనవరి 20న జన్మించిన రెబెల్ స్టార్ అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు. పశ్చిమ గోదావరి మొగల్తూరు ఆయన స్వస్థలం. సినిమాలో నటుడిగా అలరించడమే కాకుండా రాజకీయనేతగా కూడా ఆయన సేవలు అందిచారు. చిలకాగోరింక సినిమాతో 1966లో వెండితెరకు పరిచయమైన కృష్ణంరాజు ‘187’కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులని అలరించారు.
Rebel Star: కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు.. విషాదంలో టాలీవుడ్!
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. శనివారం(సెప్టెంబర్ 10) కృష్ణంరాజు పెద్ద అమ్మాయి ఉప్పలపాటి ప్రసీధ జన్మదినం కావడంతో ఆయన ఆ వేడుకల్లో కూడా పాల్గోన్నారు. కాగా ఆ సమయంలో కొంత అస్వస్థకు గురైన ఆయన, నిన్న సాయంత్రం గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో చేరడంతో ప్రభాస్ కూడా అక్కడకి చేరుకున్నారు.
చికిత్స పొందుతున్నప్పటికీ ఈరోజు ఉదయం 3 గంటల 25 నిమిషాలకు రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్త తెలియడంతో టాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజు మరణం తెలుగు సినిమాకి తీరనిలోటు అనే చెప్పాలి. ఇక ఉదయాన్నే ఈ వార్త వినడంతో టాలీవుడ్ ప్రముఖులు, రెబల్ స్టార్ అభిమానులు షాక్ కి గురవుతున్నారు.