Rent : ఘ‌నంగా ‘రెంట్’ ప్రీ రిలీజ్.. ఆగ‌స్టు 25న రిలీజ్‌

జెఎంఎం జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై శివారెడ్డి, జాష్ణిని, వనిత రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం రెంట్‌(Rent). రఘు వర్ధన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బలగం జగదీష్ నిర్మించారు

Rent team

Rent pre release event : జెఎంఎం జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై శివారెడ్డి, జాష్ణిని, వ‌నితా రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం రెంట్‌(Rent). రఘు వర్ధన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బలగం జగదీష్ నిర్మించారు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఆగస్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. రఘు వర్ధన్ రెడ్డి మంచి టాలెంట్ ఉన్న దర్శకుడని అన్నారు. తాను కో డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు నుంచి పరిచయం ఉంద‌న్నారు. ఈ చిత్ర‌ ట్రైలర్ చూశాన‌ని, చాలా బాగుందని కొనియాడారు. యూత్ కి కావాల్సిన అంశాలు అన్ని ఉన్నాయ‌న్నారు. శివారెడ్డి మంచి టాలెంట్ ఉన్న నటుడు. సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుందని, ఘ‌న విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

Mega Heroes : ఈ ఫొటోల్లో ఉన్న మెగాహీరోలు ఎవరో గుర్తుపట్టారా..? అలాగే పిక్ ఏ టైంలో తీసిందో తెలుసా..?

Rent team

హీరో శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీరు హీరోగా న‌టించాల‌ని చిత్ర ద‌ర్శ‌కుడు అడిగిన‌ప్పుడు నేను హీరోగా చేయ‌ను అని చెప్పాను. అయితే.. ద‌ర్శ‌కుడి సంస్కారం, క‌థ న‌న్ను క‌ట్టి ప‌డేశాయి. వెంట‌నే సినిమాను ఒప్పుకున్నాను. క‌థ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కామెడీ కూడా ఉంది. యువ‌త‌కు బాగా న‌చ్చుతుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి మెసెజ్‌ను ఈ చిత్రం అందిస్తుంద‌న్నారు.

హీరోయిన్ జాష్ణిని, వ‌నితా రెడ్డి లు మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు త‌మ క్యారెక్ట‌ర్ల‌ను అద్భుతంగా డిజైన్ చేశార‌ని, అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరారు.

Varun Tej : వరుణ్ తేజ్ ఫోన్‌లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా..?