Renu Desai comments on another Relationship after Divorce with Pawan Kalyan
Renu Desai : పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణు దేశాయ్ ఎవర్ని పెళ్లి చేసుకోలేదు. తన పిల్లల్ని పెంచుతూ వారితోనే కలిసి ఉంటుంది. గతంలో రేణు దేశాయ్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అని కూడా వార్తలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని వార్తలు వచ్చాయి.
తాజాగా ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో రిలేషన్ షిప్ లోకి వెళ్లడం గురించి మాట్లాడింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ఒక అరేంజ్డ్ నిశ్చితార్థం నేను చేసుకోవాలి, వేరే రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ నా పిల్లలకు సరిగ్గా న్యాయం చేయలేను ఏమో అని ఆగిపోయాను. నా పిల్లలు ఎదుగుతున్నారు. ఇప్పుడు నేను వేరే వాళ్ళతో ఇంకో జీవితం మొదలుపెడితే నా పిల్లలకు పూర్తి సమయం ఇవ్వలేను. అందుకే ఇంకో రిలేషన్ కి వెళ్ళలేదు. ఆద్యకి 18 ఏళ్ళు దాటాక తనంతట తాను అన్ని పనులు చేసుకునే స్థాయికి వచ్చాక, తను కూడా బిజీ అయ్యాక అప్పుడు ఏమైనా ఆలోచిస్తానేమో అని తెలిపింది. దీంతో భవిష్యత్తులో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకొనే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తుంది.
Also Read : Renu Desai : నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఉంది.. ఆ పార్టీలోనే జాయిన్ అవుతాను..