Renu desai emotional post indirectly says about second marriage
Renu Desai : హీరోయిన్ గా సినీ పరిశ్రమలో ఎంటర్ అయి పవన్ ని పెళ్లి చేసుకొని పవన్ భార్యగా మరింత పాపులారిటీ తెచ్చుకుంది రేణు దేశాయ్. పవన్ తో విడాకుల తర్వాత తన పిల్లలతో కలిసి ఒక్కటే ఉంటుంది. కొన్ని రోజులు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మాత్రం సినిమాలు ఒప్పుకుంటూ, షోలలో వస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది.
గతంలో రేణు దేశాయ్ కి ఆల్రెడీ రెండో పెళ్లి అయింది అని వార్తలు వచ్చాయి. అయితే రేణు రెండో పెళ్లి చేసుకుందామని వార్తలు వచ్చిన సమయంలో పవన్ అభిమానులు ఆమెని ట్రోల్ చేసి తప్పుబట్టారు. అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పవన్ మాత్రం ఇంకో పెళ్లి చేసుకొని తన లైఫ్ తో తాను బిజీగా ఉన్నా పిల్లలతో అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాడు.
తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. తన ఇన్‌స్టాగ్రామ్ లో రెండు రీల్స్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్ ఆ రీల్స్ లో.. ”జీవితంలో మనకు అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు అవసరం” అని పోస్ట్ చేసింది. మరో రీల్ లో.. ”మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి” అని పోస్ట్ చేసింది. దీంతో రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చూస్తుందా? జీవితంలో ఇంకో తోడు కావాలని చూస్తుందా అంటూ చర్చ జరుగుతుంది. ఈ పోస్టులపై కొంతమంది నెటిజన్లు మీరు పెళ్లి చేసుకోండి అంటూ సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటే ఈ సారి పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.