Renu Desai – Akira Nandan : అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.. అకిరాని కొంతమంది తిడుతున్నారు..

రేణు దేశాయ్ అకిరా సినిమా ఎంట్రీ పై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడింది.

Renu Desai gives Clarity on Akira Nandan Film Industry Entry Rumors

Renu Desai – Akira Nandan : పవన్ తనయుడు అకిరా నందన్ సినిమాల్లోకి వస్తాడని, హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదిగో వస్తున్నాడు.. ఇదిగో వస్తున్నాడు, OG సినిమాతో ఎంట్రీ ఇస్తాడు, రామ్ చరణ్ నిర్మాణంలో వస్తాడు అకిరా అని వార్తలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కొడుకు కావడంతో అకిరా నందన్ సినిమా ఎంట్రీ అనేది ప్రతిసారి సెన్సేషన్ న్యూస్ అవుతుంది.

ఇప్పటికే అకిరా నందన్ సినిమా ఎంట్రీ గురించి పలుమార్లు స్పందించిన రేణు దేశాయ్ తాజాగా మరోసారి మాట్లాడింది. రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో రేణు దేశాయ్ అకిరా సినిమా ఎంట్రీ పై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడింది.

Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. అకిరాని రామ్ చరణ్ ని లాంచ్ చెయ్యట్లేదు. అది అబద్దం. నాకు కూడా చాలా ఆర్టికల్స్ వస్తాయి అలాంటివి. నేను అవి అకిరాకి పంపుతాను. నాకెందుకు పంపుతావు ఇలాంటివి అని ఇద్దరం నవ్వుకుంటాం. OG సినిమాలో అకిరా నటించట్లేదు. అకిరా యాక్టింగ్ చేస్తే నేనే అధికారికంగా చెప్తాను. అతనికి యాక్టింగ్ ఆలోచన వచ్చినా నేనే చెప్తాను. అప్పటిదాకా మీ వ్యూస్ కోసం అకిరా గురించి అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.

నాకు నా కొడుకుని స్క్రీన్ పై చూడాలని ఉంది. అందరికంటే ముందు ఒక తల్లిగా నాకు ఉంది నా కొడుకుని స్క్రీన్ పై చూడాలని. కానీ తనకి ఏది ఇష్టం అయితే అదే చేయమంటాను. తను సినిమాల్లోకి వస్తాడా, రాడా, మ్యూజిక్ చేస్తాడా అనేది తన ఇష్టం. కొంతమంది ఏమో అకిరాని తిడుతున్నారు. అకిరా వస్తే హీరో కొడుకు, నెపోటిజం అని తిడుతున్నారు. నేను అయితే ఇదే చేయాలని ఏమి చెప్పలేదు. తనకి ఏం నచ్చితే అదే చేయమన్నాను అని మరోసారి అకిరా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది.

Also Read : Renu Desai : నేను వేరే రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలి అనుకున్నా.. కానీ పిల్లల కోసం..

అయితే అకిరా నందన్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసాడు. థమన్ దగ్గర కూడా వర్క్ చేసాడని థమన్ స్వయంగా చెప్పాడు. దీంతో అకిరా నందన్ నటుడు కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది.