Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..

Manchu Vishnu Kannappa Movie New Release Date Announced

Updated On : April 9, 2025 / 5:08 PM IST

Kannappa : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో ‘కన్నప్ప’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ తో మోహన్ బాబు నిర్మాణంలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప సినిమా తెరకెక్కుతుంది.

ఇటీవల ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోవడంతో సినిమాని వాయిదా వేశారు. ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి సాంగ్స్, టీజర్లు, పోస్టర్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also Read : Renu Desai : నేను వేరే రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలి అనుకున్నా.. కానీ పిల్లల కోసం..

నేడు కన్నప్ప టీం నుంచి మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు.

కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల చేయబోతున్నారు. ఈ విషయం మంచు విష్ణు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ అధికారికంగా తన సోషల్ మీడియాలో తెలిపారు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ తమిళ్ వాళ్లకు మొదటి 1000 కోట్ల సినిమా ఇస్తాడా? అల్లు అర్జున్ – అట్లీ పైనే భారం..