Allu Arjun : అల్లు అర్జున్ తమిళ్ వాళ్లకు మొదటి 1000 కోట్ల సినిమా ఇస్తాడా? అల్లు అర్జున్ – అట్లీ పైనే భారం..
గత కొన్ని రోజులుగా తమిళ్ సినీ పరిశ్రమ వాళ్ళు, తమిళ్ హీరోల అభిమానులు తమ సినిమాలు వెయ్యి కోట్లు సాధించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Tamil Film Industry Expecting Allu Arjun Atlee Movie will Collect 1000 Crores
Allu Arjun : బాలీవుడ్ లో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఉన్నాయి. మన తెలుగులో కూడా బాహుబలి, పుష్ప 2, RRR, కల్కి.. లాంటి పలు సినిమాలు 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసాయి. కన్నడ సినీ పరిశ్రమలో KGF 2 కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మలయాళం సినీ పరిశ్రమకి ఇప్పట్లో ఇది కష్టమే. కానీ తమిళ్ పరిశ్రమ వాళ్ళు ఈ ఫీట్ అందుకోడానికి చాలా కష్టపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా తమిళ్ సినీ పరిశ్రమ వాళ్ళు, తమిళ్ హీరోల అభిమానులు తమ సినిమాలు వెయ్యి కోట్లు సాధించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తమిళ్ సినిమాలకు హైయెస్ట్ కలెక్షన్స్ లో రోబో 2 ఉంది. ఈ సినిమా 800 కోట్లు కలెక్ట్ చేసింది. ఇటీవల వచ్చిన జైలర్ సినిమా 650 కోట్లు కలెక్ట్ చేసింది. లియో సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలన్నీ వెయ్యి కోట్లు వస్తాయని ఆశపడ్డారు కానీ రాలేదు. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ సాధిస్తుందని తమిళ పరిశ్రమ ఆశిస్తుంది.
అయితే ఈ లిస్ట్ లోకి ఇప్పుడు ఇంకో సినిమా చేరింది. అదే అట్లీ – అల్లు అర్జున్ సినిమా. నిన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీతో సినిమాని అధికారికంగా ప్రకటించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని దాదాపు 800 కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఓ వీడియోలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయబోతున్నట్టు, VFX వర్క్ ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్లు దాటేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి పని చేసే వాళ్ళల్లో అల్లు అర్జున్ తప్ప అందరూ తమిళ్ వాళ్ళే. పుష్ప 2 భారీ హిట్ అవ్వడం, అల్లు అర్జున్ కి నేషనల్ స్టార్ డమ్ ఉండడం, వరుస హిట్స్ తో ఉన్న అట్లీ డైరెక్టర్ కావడం, అగ్ర నిర్మాణ సంస్థ అవడం, 800 కోట్ల బడ్జెట్ పెట్టడంతో అంతా ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. జైలర్ 2 సినిమా మీద కేవలం ఊహాగానాలే ఉన్నాయి కానీ అల్లు అర్జున్ – అట్లీ సినిమా కచ్చితంగా 1000 కోట్లు కొడుతుందని తమిళ్ మీడియానే అంటుంది. ఒకవేళ అదే నిజమైతే తమిళ్ సినీ పరిశ్రమకు మొదట వెయ్యి కోట్ల సినిమా ఇచ్చింది అల్లు అర్జున్ అవుతాడు. మరి ఈ లోపు ఏ సినిమా అయినా ఈ ఫీట్ సాధిస్తుందా చూడాలి.
Also Read : Renu Desai : నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఉంది.. ఆ పార్టీలోనే జాయిన్ అవుతాను..