Renu Desai : జనసేన కోసం రేణూదేశాయ్ పని చేయబోతుందా..?

ఇటీవల పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ రేణూదేశాయ్ ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో జనసేన కోసం ఆమె పని చేయబోతుందా..?

Renu Desai is going to work and campaign for Janasena

Renu Desai : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఏపీ లీడర్స్ చేస్తున్న వ్యాఖ్యలు పై రేణూదేశాయ్ రియాక్ట్ అవుతూ ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. త‌న‌ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగవ‌ద్ద‌ని, రాజ‌కీయంగా త‌న మ‌ద్ద‌తు పవన్ కళ్యాణ్‌కే ఉంటుంద‌ని ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోకి రియాక్ట్ అవుతూ ఏపీ నాయకులు కూడా తిరిగి వ్యాఖ్యలు చేశారు. కాగా ఇన్నాళ్లు పవన్ గురించి, రాజకీయాలు గురించిన విషయాలు మాట్లాడని రేణూదేశాయ్ సడన్ గా ఒక వీడియో పోస్టు చేయడం సంచలనంగా మారింది.

ఆమె జనసేన కోసం వర్క్ చేయబోతుందా..? అనే సందేహం మొదలయింది. ఇక ఇదే విషయాన్ని రేణూదేశాయ్ ని అడగగా ఆమె చెప్పిన సమాధానం ఏంటి..? ప్రస్తుతం రేణూదేశాయ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈమె.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జనసేన కోసం ప్రచారం చేయబోతున్నారా’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. “నాకు అనిపించింది నేను చెప్పాను. అంతేగాని ఒకరికి సపోర్ట్ చేయాలని కాదు. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు” అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.

Also read : Renu Desai : హైదరాబాద్, పూణేలో రేణుదేశాయ్‌కి ఆస్తులు.. ఆమెకు సంపాదన ఎలా వస్తుంది..?

అలాగే ఆమె ఎప్పుడు ఎవరికి అమ్ముడు పోయి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది. తనకి అనిపించింది, తన కరెక్ట్ అని నమ్మింది మాత్రమే మాట్లాడుతూ వచ్చినట్లు చెప్పుకొచ్చింది. కాగా గతంలో రేణూదేశాయ్ ఒక ప్రముఖ ఛానల్ దగ్గర డబ్బులు తీసుకోని పవన్ కళ్యాణ్ పై నెగటివ్ కామెంట్స్ చేసిందని విమర్శలు వినిపించాయి. అయితే ఆ ఛానల్ తో ఆమె కేవలం రైతులు కోసమే పని చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేతప్ప ఆ ఛానల్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని రేణూదేశాయ్ తెలియజేసింది.