Renu Desai : రేణు దేశాయ్ కి సర్జరీ.. ఏం సర్జరీ జరిగింది?

రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి..

Renu Desai

Renu Desai : పవన్ మాజీ భార్యగా, ఒకప్పటి హీరోయిన్ గా రేణు దేశాయ్ అందరికి పరిచయమే. సినిమాలకు దూరమయినా ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అప్డేట్ లో ఉంటుంది రేణు దేశాయ్. అయితే తాజాగా రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. మొత్తానికి నా సర్జరీ తర్వాత నా క్యూటీస్ తో కలిసి బయటకు డిన్నర్ కు వచ్చాను అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో రేణు దేశాయ్ ఫేస్ కొంచెం కళ తప్పినట్టు కూడా ఉంది. దీంతో రేణు దేశాయ్ కి ఏం సర్జరీ జరిగింది? సర్జరీ జరిగింది అని పెట్టింది కానీ ఏం సర్జరీ అని చెప్పలేదు ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read : Oh Bhama Ayyo Rama : ‘ఓ భామ అయ్యో రామ’ రివ్యూ.. సుహాస్ కొత్త సినిమా ఎలా ఉంది?

గతంలో రేణు దేశాయ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపింది. మరి గుండెకు సంబంధించిన సర్జరీ ఏమైనా జరిగిందా? లేక ఇంకేదైనా సర్జరీ జరిగిందా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Also Read : The 100 : ‘ది 100’ మూవీ రివ్యూ.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ సినిమా ఎలా ఉంది?