Renu Desai : HCU ల్యాండ్స్ ఇష్యూ మీద మరోసారి మాట్లాడిన రేణు దేశాయ్.. నీకెందుకు అని చాలా మంది తిట్టారు..

HCU ఇష్యూ మీద మాట్లాడుతూ, పర్యావరణం గురించి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ ఓ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Renu Desai : HCU ల్యాండ్స్ ఇష్యూ మీద మరోసారి మాట్లాడిన రేణు దేశాయ్.. నీకెందుకు అని చాలా మంది తిట్టారు..

Renu Desai Spoke again on HCU Land Issue

Updated On : April 10, 2025 / 6:44 AM IST

Renu Desai : గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల మీద ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ 400 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తున్నారని, అక్కడి జంతువులకు నీడ లేకుండా చేస్తున్నారని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, పలువురు సెలబ్రిటీలు విమర్శలు చేసారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ కూడా విమర్శిస్తూ మాట్లాడింది.

HCU ఇష్యూ మీద మాట్లాడుతూ, పర్యావరణం గురించి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ ఓ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా మరోసారి ఈ విషయంపై మాట్లాడింది.

Also Read : Renu Desai : ఆ సినిమాని నాలుగు సార్లు చూసాను.. పడీ పడీ నవ్వాను.. రేణు దేశాయ్ కి కూడా ఆ సూపర్ హిట్ సినిమా ఇష్టం అంట..

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. చాలా మంది నన్ను తిట్టారు దానిపై స్పందించినందుకు. కొంతమంది ఒకప్పుడు హైదరాబాద్ అంతా చెట్లే కదా కొట్టేసి బిల్డింగ్స్ కట్టలేదా అని అడుగుతున్నారు. అప్పుడు మనకు తెలీదు. ఒకప్పుడు జరిగింది, మనం ఇకపై జరగకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు సమ్మర్ మరింత వరస్ట్. ఇలాగే చెట్లు కొట్టుకుంటూ పోతే ఇంకా వేడి పెరుగుతుంది. మనకు తెలిసిన తర్వాత కూడా ఏమి చేయలేదంటే మనదే తప్పు. ముందు చేసారు కదా అని ఇప్పుడు చేయకూడదు. ఈ ఇష్యూ గురించి మాట్లాడినందుకు నీకెందుకు అని తిట్టారు చాలా మంది. 400 ఎకరాలు నాశనం చేస్తున్నారు, ఆక్సిజన్ ఎక్కడ్నుంచి వస్తుంది అని ఆలోచించాలి కదా అని తెలిపింది.

Also Read : Renu Desai : సూడో సెక్యులర్స్ వల్లే సమస్య.. ఈ జనరేషన్ పేరెంట్స్ కే తెలియదు.. పిల్లలకు చెప్పట్లేదు..