Renu Desai : రైతులు కోసమే వాళ్ళతో కలిసి పని చేశా.. అంతకుమించి ఏం లేదు..
గతంలో రేణూదేశాయ్ ఒక ప్రముఖ ఛానల్ దగ్గర డబ్బులు తీసుకోని పవన్ కళ్యాణ్ పై నెగటివ్ కామెంట్స్ చేసిందని విమర్శలు వినిపించాయి. తాజాగా దీని గురించి ఆమె..

Renu Desai viral comments on fake news about pawan kalyan issue
Renu Desai : రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రేణూదేశాయ్.. తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఈమె.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియన్స్ కి తెలియజేస్తుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేణూదేశాయ్ మాట్లాడుతూ.. ‘గతంలో ఒక ఛానల్ కోసం పని చేసిన మాట నిజమే’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
కాగా గతంలో రేణూదేశాయ్ ఒక ప్రముఖ ఛానల్ దగ్గర డబ్బులు తీసుకోని పవన్ కళ్యాణ్ పై నెగటివ్ కామెంట్స్ చేసిందని విమర్శలు వినిపించాయి. దీని గురించి పవన్ అభిమానులు కూడా ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. అయితే అందులో నిజమెంత ఉందని రేణూదేశాయ్ ఇప్పుడు తెలియజేసింది. ఆమె ఏం చెప్పిందంటే.. “నేను ఆ ఛానల్ కోసం పని చేసిన మాట నిజమే. కానీ అది మీరు అనుకునేవారిని విమర్శించేందుకు కాదు. నేను ఆ ఛానల్ తో కలిసి కేవలం రైతులు కోసం ఒక కార్యక్రమం చేశాము. అంతేతప్ప ఆ ఛానల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు” అని ఆమె చెప్పుకొచ్చింది.
Also read : Renu Desai : జనసేన కోసం రేణూదేశాయ్ పని చేయబోతుందా..?
ఆ ఛానల్ వారు రైతుల ప్రోగ్రాం అంటూ రేణూదేశాయ్ ని కలవడం, తన మూవీ రీసెర్చ్ కి కూడా ఆ ప్రోగ్రాం హెల్ప్ అవుతుందని ఆలోచించే ఆమె కలిసి పని చేసినట్లు వెల్లడించింది. అంతేతప్ప తను ఎప్పుడు ఎవరికి అమ్ముడు పోయి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది. ఇక రేణూదేశాయ్ ఇచ్చిన క్లారిటీతో ఆ పుకారులకు చెక్ పడినట్లు అయ్యింది. కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఏపీ లీడర్స్ చేస్తున్న వ్యాఖ్యలు పై రేణూదేశాయ్ రియాక్ట్ అవుతూ రిలీజ్ చేసిన వీడియో.. పొలిటికల్ గా సంచలనం అయ్యింది.