ఎట్టకేలకు చేస్తున్నాడు.. RGV అక్కడ గురి పెట్టాడా? 

  • Publish Date - April 1, 2019 / 06:02 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల ప్రకటనకే తప్పితే సినిమాలు తీయరు అనే అప్రదిష్ట చాలాకాలంగా ఉంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ గురించి ప్రకటించిన చాలా రోజుల తర్వాత వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంత కాంట్రవర్శీని మూటకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఏపీలో విడుదల కాకుండా హైకోర్టు స్టే కూడా విధించింది.

ఇదిలా ఉంటే రామ్ గోపాల్  వర్మ తను తర్వాత తీయబోయే సినిమా గురించి కూడా ప్రకటించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పరిచ్చి తలైవి అమ్మ జయలలితపై వర్మ సినిమా తీస్తున్నట్లు ఆమె చనిపోయిన సమయంలో వార్తలు రాగా.. అప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ.. జయలలిత మిత్రురాలు శశికళ మీద సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వచ్చి చాలాకాలం అయినప్పటికీ, ఇప్పటివరకు ఆ సినిమాపై మాట్లాడలేదు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘శశికళ’ టైటిల్‌తో సినిమాని రూపొందిస్తున్నట్లు తన ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించారు. ‘లవ్ ఇస్ డేంజరస్‌లీ పొలిటికల్’ అనే ట్యాగ్ లైన్‌ను టైటిల్‌కు జత చేశారు.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపిన వర్మ తమిళనాడు రాజకీయాల్లో కలకలం సృష్టించారు. జయలలిత, శశికళ అనుబంధం గురించి రకరకాల కథనాలు ప్రాచర్యంలో ఉండగా.. వాటిని బేస్ చేసుకుని వర్మ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్‌జీవీ శశికళ సినిమాతో తమిళ రాజకీయాల్లో కూడా వేలు పెట్టినట్లు అయింది.