Ram Nagar Bunny : యాటిట్యూడ్ స్టార్ కోసం వచ్చిన ఆర్జీవీ.. సినిమా చూసి యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ నాకు సెట్ అవ్వుద్దో లేదో చెప్పండి..

రామ్ నగర్ బన్నీ తెరకెక్కగా అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా వచ్చారు.

RGV as Guest for Attitude Star Chandrahas Ram Nagar Bunny Movie Pre Release Event

Ram Nagar Bunny : స్టార్ సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమాతో ఆటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర ఇలా నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ నిర్మాణంలో శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో రామ్ నగర్ బన్నీ తెరకెక్కగా అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. చంద్రహాస్ ప్రామిసింగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. చంద్రహాస్ తో పాటు ప్రభాకర్ కు కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి అని అన్నారు. ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ.. ఆర్జీవీ గారు వచ్చి ఎంతకాలం అయినా దర్శకుడిగా ఆయన వేసిన ముద్ర అలాగే ఉంటుంది. రామ్ నగర్ బన్నీ సినిమాకు మా టీమ్ చాలా కష్టపడ్డారు. మాకంటే ప్రభాకర్, చంద్రహాస్ బాగా కష్టపడ్డారు. అక్టోబర్ 4వ తేదీన థియేటర్స్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు.

దివిజ మాట్లాడుతూ.. మా అన్నయ్య చంద్రహాస్ ఒక పవర్ హౌజ్. అన్నయ్య టాలెంట్ చూస్తే గర్వంగా ఉంటుంది. సినిమా విజువల్స్ బాగున్నాయి అని అందరూ అంటున్నారు అని తెలిపింది. నిర్మాత మళయజ ప్రభాకర్ మాట్లాడుతూ.. రామ్ నగర్ బన్నీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లా అనిపిస్తోంది. మా సినిమాని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు చాలా థ్యాంక్స్. ప్రతి పేరెంట్ రామ్ నగర్ బన్నీ సినిమా చూడాలి. ఈ సినిమా సక్సెస్ అయితే నిర్మాతగా మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంటుంది అని తెలిపారు. నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ.. మా అబ్బాయి సినిమాకు చాలా మంది మిత్రుల సపోర్ట్ లభించింది. విశ్వక్ సేన్ ట్రైలర్ రిలీజ్ చేయడం, ఆర్జీవీ గారు ఇవాళ రావడం మా సినిమాకు మరింత హైప్ వచ్చింది. నన్ను సీరియల్స్ లో ఇంతకాలం ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెల్లు మా రామ్ నగర్ బన్నీ సినిమా చూసి మా అబ్బాయిని ఆదరిస్తారని అనుకుంటున్నాను అని అన్నారు.

హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. ఆర్జీవీ గారు నాకు హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నాన్న ప్రభాకర్ గారికి సపోర్ట్ చేసిన వాళ్లందరికోసం నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మూడు ప్రామిస్ లు చేస్తున్నాను. నేను మాట ఇస్తే తప్పను. నా రామ్ నగర్ బన్నీ సినిమా లాభాల్లో 10 శాతం ప్రజలకు ఛారిటీ కోసం ఇచ్చేస్తాను. సినిమా చూసి ఆటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్ కు నేను అర్హుడిని కాదంటే నా నెక్స్ట్ రెండు సినిమాలకు ఆ పేరు పెట్టుకోను. సినిమా చూసి మీకు నచ్చకపోతే మీ టికెట్ ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి నేను డబ్బులు గూగుల్ పే చేస్తాను. నేనంటే నచ్చనివాళ్లు కూడా సినిమా చూడండి. మీరు నాలో నెగిటివ్ చెబితే మార్చుకుంటాను. గత రెండేళ్లలో నా గురించి చాలా నెగిటివ్ చెప్పారు, నేను విమర్శలకు బాధపడను అని అన్నారు. మరి రామ్ నగర్ బన్నీసినిమాతో ఆటిట్యూడ్ స్టార్ పరిశ్రమలో ఏ రేంజ్ లో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.