RGV Comments on Garikapati Narasimha Rao
RGV : ఇటీవల ఓ సభలో గరికపాటి నరసింహారావు మాట్లాడాల్సిన సమయంలో అందరూ చిరంజీవితో ఫోటోలకు ఎగబడుతుండటంతో గరికపాటి చిరంజీవి మీద సీరియస్ అయ్యారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంలో గరికపాటిని విమర్శిస్తున్నారు. ఆ తర్వాత గరికపాటి నరసింహారావు చిరంజీవికి క్షమాపణలు కూడా చెప్పారు. అయినా ఈ వివాదం ముగియలేదు.
నేటికి కూడా ఎవరో ఒకరు సినీ ప్రముఖులు ఈ అంశంలో గరికపాటిని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆర్జీవీ ఈ ఘటనపై స్పందిస్తూ ట్విట్టర్లో వరుస ట్వీట్స్ చేస్తూ గరికపాటిపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఆర్జీవీ గరికపాటిపై విమర్శలు చేశారు. నేడు 10టీవీతో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ గరికపాటి అంశంపై మాట్లాడారు.
Amitabh Bachchan: రజనీ సార్ మీరు నన్ను చాలా ఎక్కువగా పొగుడుతున్నారు.. అమితాబ్ బచ్చన్ ట్వీట్!
ఆర్జీవీ మాట్లాడుతూ.. ”గరికపాటి అక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళని అనొచ్చు, చిరంజీవిని కాదు. ఈ విషయంలో నాగబాబు క్షమించినా నేను క్షమించను. అయన కనిపిస్తే ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తర్వాతే కలుస్తాను. ఆయన్ని ఏమైనా చేసేయొచ్చు అందుకే” అని అన్నారు.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. ”ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాను. దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. త్వరలో కేసీఆర్ బయోపిక్ ఉంటుంది. ఎలక్షన్స్ కంటే ముందే ఆ సినిమా రావచ్చు. ఆ సినిమా ఆయనకి ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలియదు” అని అన్నారు. దీంతో మరోసారి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.