పప్పు సీన్ వాళ్లకే బాగా నచ్చిందట – ఫోన్లు చేసి మరీ చెప్పారు!
‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ పప్పు సీన్‌కు వచ్చిన ఫీడ్ బ్యాక్ గురించి వివరించిన ‘కాంట్రవర్సీ కింగ్’ రామ్ గోపాల్ వర్మ..

‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ పప్పు సీన్‌కు వచ్చిన ఫీడ్ బ్యాక్ గురించి వివరించిన ‘కాంట్రవర్సీ కింగ్’ రామ్ గోపాల్ వర్మ..
‘కాంట్రవర్సీ కింగ్’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ.
‘ఇలాంటి సినిమాలు మీకు క్రియేటివ్ శాటిస్ఫెక్షన్ ఇస్తాయా, పర్సనల్ శాటిస్ఫెక్షన్ ఇస్తాయా’ అని అడిగితే.. ‘ కేఏ పాల్‌లా మాట్లాడాలంటే (పాల్‌ని ఇమిటేట్ చేస్తూ) మంచి క్వశ్చన్.. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గిల్లడం ఇష్టం’ అంటూ ఆన్సర్ ఇచ్చిన వర్మ..
పప్పు సీన్ టీడీపీ వాళ్లకే బాగా నచ్చిందని, చాలా మంది ఫోన్లు చేసి మరీ చెప్పారని చెప్పాడు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెరకెక్కించిన సినిమా కావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నవంబర్ 29న విడుదల కానుంది..