×
Ad

RGV : ఇది కదా ‘ఆర్జీవీ’ రేంజ్.. లైఫ్ టైం కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఊదేశారు..

తన సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా మోత మోగించాడు. (RGV)

RGV

RGV : మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించాడు ఆర్జీవీ. తన సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా మోత మోగించాడు. తన సినిమాలు క్లాసిక్స్ లా మిగిలిపోయాయి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఆర్జీవీ సినిమాలు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఆర్జీవీ రేంజ్ మారదు, సినిమా పరంగా ఆయన అంటే అందరికి ఇష్టమే అనడానికి శివ సినిమా రీ రిలీజ్ నిలిచింది.(RGV)

ఆర్జీవీ – నాగార్జున కాంబోలో వచ్చిన శివ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ళ తర్వాత శివ సినిమా ఇటీవల నవంబర్ 14న రీ రిలీజ్ చేసారు. 4K చేసి, సౌండ్ డిజైన్ మరింత ఇంప్రూవ్ చేసి ఈ సినిమాని రీ రిలీజ్ చేయడంతో నాగార్జున ఫ్యాన్స్, ఆర్జీవీ ఫ్యాన్స్, శివ సినిమా అభిమానులు, సినిమా లవర్స్ ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. శివ సినిమా రీ రిలీజ్ లో వచ్చిన కలెక్షన్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Also Read : Premante Trailer : ‘ప్రేమంటే’ ట్రైలర్ వచ్చేసింది.. కానిస్టేబుల్ గా యాంకర్ సుమ..

శివ సినిమా 1989 లో రిలీజయింది. అప్పట్లో ఈ సినిమాని 75 లక్షల బడ్జెట్ తో తీయగా ఆల్మోస్ట్ తెలుగులో నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం నైజాం ఏరియాలోనే ఒక కోటి రూపాయలు కలెక్షన్స్ సాధించింది శివ సినిమా. అయితే లైఫ్ టైంలో వచ్చిన ఈ కలెక్షన్స్ అన్ని ఇప్పుడు రీ రిలీజ్ లో బద్దలు కొట్టేసారు. శివ సినిమా రీ రిలీజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 4.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. 5 కోట్ల రౌండ్ ఫిగర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ కలెక్షన్స్ చూసి అభిమానులతో పాటు, మూవీ యూనిట్ కూడా షాక్ అవుతున్నారు. లైఫ్ టైం కలెక్షన్స్ రికార్డ్ ని మూడు రోజుల్లోనే లేపేసారుగా అని అంటున్నారు. ఇది కదా ఆర్జీవీ రేంజ్. ఆర్జీవీ కరెక్ట్ గా సినిమా తీస్తే ఏ డైరెక్టర్ పనికి రారు అని ఆయన ఫ్యాన్స్, సినిమా లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also See : Kiran Abbavaram : సినిమా సక్సెస్ తర్వాత.. భార్య, కొడుకుతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఫొటోలు..