RGV Den : ట్యాలెంట్‌కి ఆర్జీవీ బంపర్ ఆఫర్.. డైరెక్టర్, రైటర్.. ఏదైనా అవ్వొచ్చు ఆర్జీవీ డెన్‌లో.. ఇలా అప్లై చేసుకోండి..

ఇక ఆర్జీవీ డెన్ అనే పేరుతోనే ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. ఈ ఆర్జీవీ డెన్ తో ట్యాలెంట్ ఉన్నవాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో తెలుపుతూ ఆర్జీవీ ప్రకటించారు.

RGV Den welcomes Talented Directors Writers and so many positions how to apply details here

RGV Den Talent Hunt : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆర్జీవీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో, యూట్యూబ్(Youtube) లో తన ఫిలాసఫీ మాటలతో అందర్నీ ఇంప్రెస్ చేస్తూ ఉంటున్నాడు. అతన్ని పొగిడేవాళ్లు ఎంతమంది ఉన్నా అతన్ని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఆర్జీవీ అవేమి లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతాడు.

ఆర్జీవీ సినిమా తీసినా, ట్వీట్ చేసినా, దేని గురించి అయినా మాట్లాడినా వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల ఆర్జీవీ కొత్త ఆఫీస్ కట్టనంటూ ఆర్జీవీ డెన్ వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఆ ఆఫీస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమాల్లో డాన్ లకు చూపించే డెన్ లాగా దీన్ని తయారు చేశారు. లోపల అంతా కూడా ఆర్జీవీ సినిమాలు, ఆర్జీవీ సినిమాల ఫొటోలు, సెలబ్రిటీలతో ఆర్జీవీ ఫొటోలు, ఆర్జీవీ హీరోయిన్స్ ఫొటోలు, ఆర్జీవీ చెప్పిన కొటేషన్లతో, గ్రీనరీతో, కొండలు, గుహలు ఉన్నట్టు అద్భుతంగా డిజైన్ చేశారు. దీంతో అంతా ఒక్కసారి అయినా డెన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు.

ఇక ఆర్జీవీ డెన్ అనే పేరుతోనే ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. ఈ ఆర్జీవీ డెన్ తో ట్యాలెంట్ ఉన్నవాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో తెలుపుతూ ఆర్జీవీ ప్రకటించారు. ఆర్జీవీ డెన్ కి ఒక వెబ్‌సైట్ రూపొందించారు. ఇందులో డైరెక్టర్స్, రైటర్స్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ప్రస్తుతం అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆ వెబ్‌సైట్ కి వెళ్లి అప్లై చేసుకోండని ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samantha : బాలిలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. సమంత బాలి ట్రిప్ ఫోటోలు..

అయితే వాటిల్లో మీకు దేంట్లో ట్యాలెంట్ ఉంటే దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి కేటగిరికి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఇచ్చిన టాస్కులు చేసి, మన పర్సనల్ డీటెయిల్స్ తో వాళ్ళు ఇచ్చిన మెయిల్స్ కి పంపించాలి. ఈ వివరాలన్నిటి కోసం https://rgvden.com/ సైట్ ని చూస్తే అన్ని వివరాలు మరింత క్లారిటీగా మీకు తెలుస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మరి మీరు రైటర్, డైరెక్టర్ అవ్వాలనుకుంటే మీ ట్యాలెంట్ చూపించి ఆర్జీవినే మీకు నిర్మాతగా మారేలా చేసుకోండి.