RGV Direction YS Jagan Biopic part one Vyooham Trailer Released
Vyooham Trailer : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వ్యూహం అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు. జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఆర్జీవీ.
వైఎస్ జగన్ కి సంబంధించిన ఈ కథలో.. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? సీఎం అయ్యాక ఏం చేశారు అనే అంశాలతో ఈ రెండు సినిమాలు ఉండనున్నాయి. ఇప్పటికే వ్యూహం సినిమా నుంచి టీజర్ విడుదల చేసి ఆసక్తి నెలకొల్పారు.
Also Read : Renu Desai : అకీరాపై రేణు దేశాయ్ కలలు ఏంటో తెలుసా.. నా కొడుకుని అలా చూడాలని ఉంది..
తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో జగన్, భారతి, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. జగన్ గా నటుడు అజ్మల్ జీవించాడు అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక చివర్లో చంద్రబాబు క్యారెక్టర్ తో పవన్ కళ్యాణ్ పై, జగన్ పై చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వ్యూహం ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. మరి ఈ సినిమా రాజకీయంగా ఏపీలో ఎన్ని ప్రకంపనలు తెస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.