RGV : Powerstar Movie..ట్రైలర్‌కి రూ.25.. సినిమాకు రూ.150

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 10:08 AM IST
RGV : Powerstar Movie..ట్రైలర్‌కి రూ.25.. సినిమాకు రూ.150

Updated On : July 19, 2020 / 10:30 AM IST

Lockdown కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. OTT వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. కానీ RGV మాత్రం తనదైన స్టైల్‌లో ఆన్‌లైన్ వేదికలపై వరుస సినిమాలు విడుదల చేస్తూ జేబు నింపుకుంటున్నాడు.అసలే Varma సినిమా మొదలుపెట్టాడంటే.. ఒక్క రూపాయి లేకుండా ఫుల్ పబ్లిసిటీ తెచ్చేస్తాడు. ఇప్పుడు POWERSTAR మూవీతో దర్శక నిర్మాతలు సైతం షాకయ్యేలా కొత్త స్ట్రాటజీ అమలు చేశాడు.

జనాల్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో సిద్ధహస్తుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా తన లేటెస్ట్ మూవీ POWERSTAR విషయంలోనూ అదే చేస్తున్నాడు. ఈ కరోనా కాలాన్ని తనకు అనువుగా మార్చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం మాకు పనిలేదు.. పైసలు రావడం లేదు అని మొత్తుకుంటుంటే.. వర్మ మాత్రం సరికొత్త ఆలోచనలతో వ్యాపారం చేసేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం సినిమాలతో జనం సొమ్మును వారితోనే ఖాతాలోనే వేసుకుంటున్న వర్మ.. పవర్ స్టార్ పేరుతో భారీ బిజినెస్‌ ప్లాన్ చేశాడు.

పవన్ కల్యాణ్ జీవిత కథ కాదంటూనే POWERSTAR పేరుతో మూవీ రూపొందిస్తున్న వర్మ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేశాడు. తన వెబ్‌సైట్‌లోనే రిలీజ్‌ చేస్తున్న పవర్ స్టార్‌ సినిమా క్రేజ్‌ని విడుదలకు ముందే క్యాష్ చేసుకుంటున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమా ట్రైలర్‌కి కూడా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.

2020, July 22th న ఉదయం 11గంటలకు విడుదలవుతున్న POWERSTAR మూవీ ట్రైలర్ చూడాలంటే 25రూపాయలు చెల్లించాల్సిందేనన్నాడు. అలాగే సినిమాకు అయితే ఏకంగా 150 రూపాయలు ఫిక్స్ చేశాడు. అది కూడా ఈ నెల 25వ తేదీ వరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటేనే. టైమ్ దాటితే.. 250 రూపాయలు చెల్లించాల్సిందేనని ఖరాఖండీగా చెప్పాశాడు. అందుకే రిలీజ్ వరకు ఆగకుండా ముందే బుక్ చేసుకుని 100 ఆదా చేసుకోండి అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు.

ఏదేమైనా వర్మ బిజినెస్ ఐడియాలు చూసి ఇండస్ట్రీలే షాక్ అవుతున్నాయి. మొత్తంగా కరోనా ముందు.. కరోనా తరువాత అనేలా వర్మ ప్లాన్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఎంతైనా వర్మ ఐడియాకి అవార్డు ఇవ్వాల్సిందే మరి.