లక్ష్మీస్ NTR : నడి రోడ్డుపై వర్మ ప్రెస్ మీట్

  • Publish Date - April 28, 2019 / 07:08 AM IST

ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ నడి రోడ్డుపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు ట్వీట్స్ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో విడుదల కాలేదనే సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో విడుదల చేయవద్దని పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. మే 1వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. 

తాను విజయవాడలో ల్యాండ్ అవుతున్నట్లు ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న విడుదలవుతోందని..విజయవాడలోని నోవాటెల్‌లో ప్రెస్ మీట్ ఉంటుందని ప్రకటించారు. అయితే కొద్దిసేపటికి వర్మ మరో ట్వీట్ చేశారు. ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం…కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్నింగ్ ఇవ్వటం మూలాన భయంతో క్యాన్సిల్ చేశారని చెప్పారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోటల్స్, క్లబ్బులు.. మేనేజ్ మెంట్లు..మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారని ట్వీట్‌లో తెలిపారు. 

నోవాటెల్‌లో కాకుండా నడి రోడ్డుపై ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు వర్మ ప్రకటించాడు. పైపుల రోడ్డులో NTR circle దగ్గర today sunday 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపాడు. మీడియా మిత్రులకి, NTR నిజమైన అభిమానులకి..నేనంటే అంతో..ఇంతో..ఇష్టమున్న ప్రతీవారికీ, నిజాని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్‌లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం అంటూ వర్మ ప్రకటించారు. మరి ఈ ప్రెస్‌మీట్‌లో వర్మ ఏమి చెబుతాడో చూడాలి.