×
Ad

RGV : బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ లు చేస్తున్న ఆర్జీవీ.. శివ తర్వాత ఏ సినిమానో తెలుసా? ట్రైలర్ కూడా రిలీజ్..

శివ సినిమా రీ రిలీజ్ అవుతున్న క్రమంలోనే ఆర్జీవీ ఇంకో సినిమా కూడా రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.(RGV)

RGV

RGV : ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ తన మొదటి సినిమా, సరికొత్త సినిమా సృష్టించిన నాగార్జున శివ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. శివ సినిమా 4K చేసి నవంబర్ 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ కి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే శివ సినిమా రీ రిలీజ్ అవుతున్న క్రమంలోనే ఆర్జీవీ ఇంకో సినిమా కూడా రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.(RGV)

ఆర్జీవీ తీసిన సూపర్ హిట్, క్లాసిక్ సినిమాల్లో రంగీలా ఒకటి. ఇప్పుడు ఆ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఊర్మిళా మండోద్కర్ మెయిన్ లీడ్ గా అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. హిందీలో తెరకెక్కించిన రంగీలా సినిమా తర్వాత తెలుగులో కూడా డబ్బింగ్ తో రిలీజ్ అయింది. కేవలం 5 కోట్లతో తీసిన ఈ సినిమా అప్పట్లోనే 33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి భారీ హిట్ గా నిలిచింది.

Also Read : Girija Oak : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అందాల భామ ఎవరు..? ఒక్క ఇంటర్వ్యూతో షేక్ చేసేస్తుందిగా..

ఏ ఆర్ రహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయి మ్యూజికల్ గా కూడా విజయం సాధించింది. ఇప్పటికి రంగీలా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి సూపర్ హిట్ సినిమా రంగీలా ని నవంబర్ 28న రీ రిలీజ్ చేస్తున్నారు. 30 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హిందీలో రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అదే డేట్ కి తెలుగులో కూడా రీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

తాజాగా రంగీలా రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ఊర్మిళ ఫ్యాన్స్, అమీర్ ఖాన్, ఆర్జీవీ ఫ్యాన్స్, రంగీలా సినిమా ఫ్యాన్స్ ఈ సినిమాని మరోసారి చూడటానికి సిద్ధమవుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ రావడం, అతని బాయ్ ఫ్రెండ్ ఆమె దూరమైందని భావించడం, సినిమా హీరో ఆమెని ఇష్టపడటం.. ఈ కథాంశంతో రంగీలా సినిమా లవ్ స్టోరీగా సాగుతుంది. ఈ సినిమా తర్వాత ఇదే కథతో చాలా సినిమాలు వచ్చాయి.

Also Read : Dharmendra : బాలీవుడ్ స్టార్ హీరో.. నిన్న మరణించాడన్నారు.. ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్..

ఆర్జీవీ శివ సినిమా నవంబర్ 14న రీ రిలీజ్ అవుతుండటం, రెండు వారాల గ్యాప్ తో నవంబర్ 28న రంగీలా రిలీజ్ అవ్వడం గమనార్హం. రంగీలా రీ రిలీజ్ ట్రైలర్ చూసేయండి..

Also Read : Shiva Child Artist : ‘శివ’ సైకిల్ ఛేజింగ్ సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..