RGV – Sandeep Reddy : ఆర్జీవీ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ.. స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? ఒక ఊపు ఊపండి సర్..

ఈ ఈవెంట్లో ఆర్జీవీ - సందీప్ వంగ ఒకర్నొకరు ఇంటర్వ్యూ చేశారు.

RGV Sandeep Reddy Vanga Special Interview Promo Released

RGV – Sandeep Reddy : ఒకప్పుడు శివ సినిమాతో మొదలుపెట్టి తన సినిమాలతో సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు ఆర్జీవీ. ఇప్పుడు అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమల్ తో సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇద్దరూ సినిమా రూల్స్ బ్రేక్ చేసి సక్సెస్ కొట్టినవాళ్ళే. సందీప్ కి ఆర్జీవీ అంటే చాలా ఇష్టం. అలాగే ఆర్జీవీకి కూడా సందీప్ అంటే చాలా ఇష్టం.

ఇప్పటికే ఆర్జీవీ, సందీప్ వంగ కలిసి పలుమార్లు కనిపించి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. తాజాగా ఇద్దరూ కలిసి సినిమాటిక్ ఎక్స్‌పో అనే ఈవెంట్ కు గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో ఆర్జీవీ – సందీప్ వంగ ఒకర్నొకరు ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేయగా అది వైరల్ గా మారింది.

Also Read : Ram Charan : మైసూరుకు బయలుదేరిన రామ్ చరణ్.. RC16 షూటింగ్ షురూ..

ఈ ప్రోమోలో.. ఆర్జీవి బాహుబలి లాంటి సినిమాని చేయగలవా అనగా సందీప్ ట్రై చేస్తాను అన్నాడు. ఇక సందీప్ సత్య సినిమా గురించి, రంగీలా సినిమా గురించి మాట్లాడాడు. క్రిటిక్స్ నోర్లు మూయించాలి ఎప్పటికైనా అని అన్నాడు. ఇక ఆర్జీవీ.. యానిమల్ సినిమాతో సినిమా రూల్స్ అన్ని డస్ట్ బిన్ లో పడేసావు అన్నాడు. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ల గురించి మాట్లాడాడు. అలాగే నువ్వు రామ్ గోపాల్ వర్మ కి బాప్ అని అన్నాడు. దీంతో సందీప్.. మీరు మళ్ళీ ఒక ఊపు ఊపండి సర్ అని అంటే ఆర్జీవీ.. నేను అదే పనిలోనే ఉన్నాను అని నీ మీద ఒట్టు వేసి చెప్తున్నా అన్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూ కోసం ఆర్జీవీ, సందీప్ వంగ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..