Ram Charan : మైసూరుకు బయలుదేరిన రామ్ చరణ్.. RC16 షూటింగ్ షురూ..
తాజాగా నేడు రామ్ చరణ్ మైసూర్ బయలుదేరాడు.

Ram Charan went to Mysore for RC 16 Movie Shoot Airport Visuals goes Viral
Ram Charan : రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక చరణ్ అప్పుడే RC16 సినిమా మొదలుపెట్టాడు. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Samantha : అతనికిచ్చిన గిఫ్టులకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టాను.. సమంత సమాధానం నాగచైతన్య గురించేనా?
బుచ్చిబాబు సాన ఈ సినిమాని రా & రస్టిక్ గా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే మూడు పాటల వర్క్ కూడా అయిపోయిందని గతంలోనే తెలిపాడు. ఇటీవల బుచ్చిబాబు మైసూర్ చాముండేశ్వరి ఆలయం వద్ద దిగిన ఫొటో షేర్ చేస్తూ మైసూర్ లో RC16 షూటింగ్ మొదలుపెట్టాము అని తెలిపాడు. తాజాగా నేడు రామ్ చరణ్ మైసూర్ బయలుదేరాడు.
Global Star Ram Charan takes off to Mysuru to shoot for #RC16#GameChanger#RamCharan pic.twitter.com/IFbZ45vZ62
— Deccan Chronicle (@DeccanChronicle) November 24, 2024
రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి మైసూర్ బయలుదేరగా ఎయిర్ పోర్ట్ లో విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. రేపట్నుంచి రామ్ చరణ్ RC16 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. త్వరగా షూటింగ్ పూర్తిచేసి సినిమా త్వరగా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. RC16 సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.