Samantha : అతనికిచ్చిన గిఫ్టులకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టాను.. సమంత సమాధానం నాగచైతన్య గురించేనా?

తాజాగా సమంత సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసింది.

Samantha : అతనికిచ్చిన గిఫ్టులకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టాను.. సమంత సమాధానం నాగచైతన్య గురించేనా?

Samantha Controversy Answer to Regarding her Ex in Citadel Promotions

Updated On : November 24, 2024 / 1:23 PM IST

Samantha : ఆరోగ్యం కోసం కొంచెం గ్యాప్ తీసుకున్న సమంత ఇటీవలే మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవుతుంది. సమంత నటించిన సిటాడెల్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో సమంత యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేస్తుంది. చైతుతో విడాకుల తర్వాత సమంత తన బిజినెస్, సినిమాలతో బిజీ అవుతుంది.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ నెక్స్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ వైరల్..

తాజాగా సమంత సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో వరుణ్ ధావన్.. అవసరం లేని దానిపై ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఖర్చుపెట్టావు అని అడగ్గా సమంత సమాధానమిస్తూ.. నా ఎక్స్ కి ఇచ్చిన ఖరీదైన గిఫ్టులకు అని చెప్పింది. దీంతో సమంత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అయితే సమంత చెప్పింది నాగచైతన్యకు ఇచ్చిన గిఫ్టుల గురించా లేక అంతకుముందు రిలేషన్ లో ఉన్న వ్యక్తి గురించా అనేది క్లారిటీ ఇవ్వకపోయినా నెటిజన్లు, ఫ్యాన్స్ మాత్రం సమంత చెప్పింది చైతు గురించి అనుకుంటున్నారు. ఇక చైతు త్వరలోనే శోభితని పెళ్లి చేసుకోబోతున్నాడు.