Murali Raju : ఆర్జీవీ మేనమామ, ప్రముఖ నిర్మాత మృతి.. నివాళులు అర్పించడానికి తరలి వచ్చిన టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు..

ఆర్జీవి మేనమామ, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన తండ్రి మురళీ రాజు మంగళవారం కన్నుమూశారు. గతంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన మురళీరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 70 ఏళ్ళ వయసులో మంగళవారం నాడు.................

RGV Uncle and producer Murali Raju Passes away

Murali Raju :  ఆర్జీవి మేనమామ, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన తండ్రి మురళీ రాజు మంగళవారం కన్నుమూశారు. గతంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన మురళీరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 70 ఏళ్ళ వయసులో మంగళవారం నాడు హైదరాబాద్ లోని మధురానగర్ లో అయన సొంతగృహంలో కన్నుమూశారు. మురళీరాజు మృతిపై టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అల్లు అర్జున్, అమీర్ ఖాన్, అల్లు అరవింద్.. ఇలా పలువురు స్టార్స్ ఇంటికి వెళ్లి మురళి రాజుకి నివాళులు అర్పించారు.

Vidya Balan : విద్యాబాలన్ డర్టీ పిక్చర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఆర్జీవీకి మేనమామ కావడం, గతంలో నిర్మాతగా పలు సినిమాలు తీయడం, ఆయన తనయుడు మధు మంతెన బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ అవ్వడంతో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. గతంలో అనేక సార్లు ఆర్జీవీ.. తన మేనమామ తనకు సినిమాల్లో మొదటి గురువని, ఆయనే నాకు సినిమాలు అలవాటు చేశాడని కూడా తెలిపాడు. మురళీరాజు మరణంతో ఆర్జీవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.