Vidya Balan : విద్యాబాలన్ డర్టీ పిక్చర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బాలీవుడ్ స్టార్ ఫోటోగ్రాఫర్, సెలబ్రిటీలకు ఫోటోషూట్స్ చేసే డబూ రతాని కోసం విద్యా బాలన్ దిగిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారగా నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు............

Vidya Balan : విద్యాబాలన్ డర్టీ పిక్చర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Vidya Balan photo goes viral click by dabboo rathani netizens trolled her

Vidya Balan :  బాలీవుడ్ లో పరిణీత, గురు, డర్టీ పిక్చర్, కహాని.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన భామ విద్యాబాలన్. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలో కూడా నటించి మెప్పించింది. కమర్షియల్, ఉమెన్ ఓరియెంటెడ్.. ఇలా అనేకరకాల సినిమాలతో మెప్పిస్తుంది విద్యాబాలన్. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులు చేస్తుంది. ఎక్కువగా ట్రెడిషినల్ గా ఫొటోలు పెడుతూ అప్పుడప్పుడు మాత్రం బోల్డ్ ఫొటోలు కూడా పోస్టు చేస్తుంది ఈ 44 ఏళ్ళ భామ.

బాలీవుడ్ స్టార్ ఫోటోగ్రాఫర్, సెలబ్రిటీలకు ఫోటోషూట్స్ చేసే డబూ రతాని కోసం విద్యా బాలన్ దిగిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారగా నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్స్ తో అప్పుడప్పుడు సెమి న్యూడ్ ఫొటోషూట్స్, వెరైటీ ఫొటోషూట్స్ చేస్తాడు డబూ రతాని. తాజాగా విద్యాబాలన్ తో కూడా అలాంటి ఫోటోషూట్ చేశాడు.

Holi Celebrations : టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల హోలీ సంబరాలు..

విద్యాబాలన్ న్యూడ్ గా ఓ చైర్ లో కూర్చొని కేవలం పేపర్ అడ్డం పెట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని, చేతిలో ఓ కాఫీ కప్ పట్టుకొని స్టైల్ గా ఫోజ్ ఇచ్చింది. ఈ స్టిల్ ని డబూ రతాని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూడటానికి సెమి న్యూడ్ గా ఉన్నా కేవలం పేపర్ అడ్డం పెట్టుకొని ఫోటో పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులతో పాటు, నెటిజన్లు కూడా విద్యాబాలన్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మరీ ఇంత బోల్డ్ అవసరమా, 44 ఏళ్ళ వయసులో ఇలాంటి ఫొటోషూట్స్ అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు డబూ రతాని ని కూడా ఇలాంటి ఫొటోలు తప్పితే మంచివి తీయవా, ఫోటోగ్రఫీ అంటే ఇలాంటి ఫొటోలు తీయడమేనా అని ట్రోల్ చేస్తున్నారు. గతంలో కియారా అద్వానీ ఫోటో విషయంలో కూడా ఇలానే డబూ రతానిని నెటిజన్లు విమర్శించారు. మరి ఈ విమర్శలపై విద్యాబాలన్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

View this post on Instagram

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)