కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ‘పవర్ స్టార్’ ఎన్నికల ఫలితాల తర్వాత కథ.. అంటూ ఓ సినిమా రూపొందించాడు. ఇటీవలే ఓ పాట విడుదల చేసిన వివాదం రేపిన వర్మ తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్‌కి సినిమాకి సంబంధం లేదు అంటున్నాడు కానీ పవన్ పొలిటికల్ కెరీర్‌పైనే ఫోకస్ చేశాడని అర్థమవుతోంది. ట్రైలర్‌లో చంద్రబాబు, త్రివిక్రమ్, బండ్ల గణేష్ వంటి కొన్ని క్యారెక్టర్లు చూపించాడు.