రియాకు కోపమొచ్చింది.. అధికారుల కారునే ఒక్క గుద్దు గుద్దింది..

  • Published By: sekhar ,Published On : August 28, 2020 / 07:49 PM IST
రియాకు కోపమొచ్చింది.. అధికారుల కారునే ఒక్క గుద్దు  గుద్దింది..

Updated On : August 28, 2020 / 8:19 PM IST

Rhea Chakraborthy got angered when media surrounded: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణకు హాజరు అయిన రియా చక్రవర్తికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె ఏకంగా అధికారుల కారునే మోచేత్తో గట్టిగా గుద్దింది. డీఆర్‌డీవో కార్యాలయంలో జరుగుతున్న సీబీఐ విచారణకు రియా నేడు హాజరు కావలసి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆమెకు రక్షణగా ఓ కారు పంపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మీడియా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుంది. రియాపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఎస్కార్ట్ సిబ్బంది మాత్రం రియాను వారి మధ్య నుంచి తీసుకొచ్చి కారు ఎక్కించారు.

అప్పటికీ రియాను మీడియా ప్రతినిధులు ప్రశ్నలడుగుతూనే ఉన్నారు.
దీంతో రియాకు కోపం పెరిగిపోయింది. వెంటనే తన మోచేత్తో కారు లోపలినుంచి విండోపై బలంగా గుద్దింది. ఆ గుద్దుకు తలుపు కొంత తెరుచుకుంది. ఈ ఘటనను కెమెరాలలో బంధించిన మీడియా ఎక్లూజివ్‌గా వేస్తోంది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో, మీడియా మరియు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://youtu.be/UONH9YW04Og