Rishab Shetty : దయచేసి ఆ శబ్దాలని అనుకరించకండి.. కాంతార సినిమా చూసిన వాళ్లకి రిషబ్ శెట్టి విజ్ఞప్తి..

కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి భారీ విజయం అందించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. మా సినిమాలో చూపించిన ఓ.. అనే శబ్దం, మరిన్ని శబ్దాలు కొంతమంది బయట అనుకరిస్తున్నరు. అది మీ అభిమానం. కాకపోతే దయచేసి.........

Rishab Shetty : దయచేసి ఆ శబ్దాలని అనుకరించకండి.. కాంతార సినిమా చూసిన వాళ్లకి రిషబ్ శెట్టి విజ్ఞప్తి..

Rishab Shetty request audience dont imitate kantara movie sounds at out side

Updated On : October 23, 2022 / 8:05 AM IST

Rishab Shetty :  రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ సినిమా ‘కాంతార’. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెప్టెంబర్ లోనే కన్నడలో రిలీజై భారీ హిట్ కొట్టి అక్కడ మంచి కలెక్షన్లని సాధించింది. దీంతో గత వారం తెలుగు, హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దేశమంతటా ఇప్పుడు కాంతార సినిమా పేరే వినిపిస్తుంది.

ఈ సినిమాలో కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ముఖ్యంగా భూతకోల నృత్యకారులను, వారి నృత్యాలని, వారి ఆచారాలు, సాంప్రదాయాలని చూపించారు. ఈ సినిమాలో భూత కోలం ఆడే వ్యక్త్తో ఓ.. అంటూ అరుస్తూ డ్యాన్స్ చేస్తారు. ఆ శబ్దానికి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అయితే కొంతమంది సినిమా చూసిన వాళ్ళు బయట ఈ శబ్దాన్ని అనుకరించడం, రీల్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే దీనిపై రిషబ్ శెట్టి స్పందించారు.

Prabhas : ప్రభాస్ బర్త్‌డే.. ఈ సంవత్సరం అయినా ప్రభాస్ రేంజ్ హిట్ కొడతాడా??

కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఈ సినిమాకి భారీ విజయం అందించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. మా సినిమాలో చూపించిన ఓ.. అనే శబ్దం, మరిన్ని శబ్దాలు కొంతమంది బయట అనుకరిస్తున్నరు. అది మీ అభిమానం. కాకపోతే దయచేసి వాటిని అనుకరించకండి. అది అక్కడి ప్రజల సెంటిమెంట్, నమ్మకం. ఇది చాలా సున్నితమైన అంశం. ఇలా బయట ఆ శబ్దాలు చేయడం వల్ల తమ ఆచారం దెబ్బ తింటుందని వారు అభిప్రాయపడతారు. కాబట్టి ఎవరూ ఈ సినిమాలోని శబ్దాలని అనుకరించవద్దు అని విజ్ఞప్తి చేసుకుంటుంన్నాను” అని తెలిపారు.