Prabhas : ప్రభాస్ బర్త్‌డే.. ఈ సంవత్సరం అయినా ప్రభాస్ రేంజ్ హిట్ కొడతాడా??

బాహుబలి తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్ లో ఓకే అనిపించినా తెలుగు ప్రేక్షకులకి మాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా అతికష్టం మీద ఈ సినిమాకి పెట్టిన 300 కోట్ల పెట్టుబడి అయితే సాధించారు. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా.............

Prabhas : ప్రభాస్ బర్త్‌డే.. ఈ సంవత్సరం అయినా ప్రభాస్ రేంజ్ హిట్ కొడతాడా??

Prabhas :  ప్రభాస్ పేరు కాదు అదో ట్రెండ్ సెట్టర్. నార్మల్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. వరసగా సినిమాలు, వేల కోట్ల బడ్జెట్, మోస్ట్ వాంటెడ్ హీరోగా ఇమేజ్, వరల్డ్ వైడ్ గా విపరీతమైన క్రేజ్. ప్రజెంట్ ప్రభాస్ కెరీర్ స్టైల్ ఇది. ప్రభాస్ కి వరసగా సినిమాలున్నాయి, కావల్సినంత స్టార్ డమ్ ఉంది. కానీ బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మిస్ అవుతోంది.

సౌత్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయిపోయారు. బాలీవుడ్ స్టార్ హీరోల మీద కూడా పెట్టని వందల కోట్ల పెట్టుబడిని ప్రభాస్ సినిమాలకు పెడుతున్నారు మేకర్స్. 5 సినిమాలు, 2 వేలకోట్లకు పైగా బడ్జెట్, ఈ రేంజ్ లో ప్రభాస్ క్రేజ్, ఇమేజ్ పెరిగిపోయింది.

బాహుబలి తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్ లో ఓకే అనిపించినా తెలుగు ప్రేక్షకులకి మాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా అతికష్టం మీద ఈ సినిమాకి పెట్టిన 300 కోట్ల పెట్టుబడి అయితే సాధించారు. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఎంతగా నిరాశపరిచిందో అందరికి తెలిసిందే. దాదాపు ఈ సినిమా 200 కోట్ల నష్టాన్ని మూటకట్టుకుంది. రెండు సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు.

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K సినిమాలను సెట్స్ పై ఉంచిన రెబల్ స్టార్ మారుతి సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రభాస్ సినిమా నుంచి ఒక్క ఫోటో రిలీజ్ చేస్తేనే పండగ చేసుకుంటారు అభిమానులు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ సినిమాల నుంచి ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో అని ఆశిస్తున్నారు. కానీ అభిమానులు ఇప్పుడు ప్రభాస్ కి అర్జెంట్ గా భారీ హిట్ కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకోకపోయినా ప్రభాస్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం.

ప్రభాస్ చేతిలో 5 సినిమాలున్నాయి. వేల కోట్ల బడ్జెట్ ఉంది. విపరీతమైన క్రేజ్ ఉంది. వరల్డ్ వైడ్ గా మంచి ఇమేజ్ ఉంది. కానీ ఇవేవీ ప్రభాస్ కి హిట్స్ సంపాదించలేకపోతున్నాయి. అర్జెంటుగా ప్రభాస్ కి కావల్సింది హిట్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేకపోయిన ప్రభాస్ కెరీర్ లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ సక్సెస్ కోసం ఇండస్ట్రీతో పాటు ఫాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ హీరో అయ్యాక సక్సెస్ లు తగ్గిపోయాయి ప్రభాస్ కి. ఆల్రెడీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా ఆడియన్స్ అంచనాలకి రీచ్ కాలేకపోతున్నారు ప్రభాస్. వరసగా బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ అయ్యాయి. ఈమధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ టీజర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇది పెద్ద వివాదంలో చిక్కుకుంది. జనవరి సంక్రాతి రిలీజ్ కు రెడీ ఉన్న ఆదిపురుష్ మీద ఇప్పటికే చాలా నెగెటివ్ టాక్ వచ్చింది. ఒకవేళ అందరూ అనుకున్నట్టు నిజంగానే ఇది బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా అయితే కచ్చితంగా దీని రిజల్ట్ కూడా చెప్పలేము.

Kapata Nataka Sutradhari : ఆహాలో మరో సరికొత్త సినిమా.. బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ తో ‘కపట నాటక సూత్రధారి’..

ఇక బర్త్ డేకి సలార్, ప్రాజెక్ట్ K, మారుతి సినిమాల నుంచి ఏం అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. మరి ఈ పుట్టిన రోజు సంవత్సరం ప్రభాస్ వి మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటితో అయినా ప్రభాస్ అయన రేంజ్ తగ్గ హిట్ కొడతాడేమో చూడాలి. ప్రభాస్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఈ బర్త్ డేకి స్పెషల్ గా కోరుకుంటున్నారు.