×
Ad

Rishab Shetty : అసలే బాయ్ కాట్ ట్రెండ్.. పూర్తిగా కన్నడలో మాట్లాడిన రిషబ్ శెట్టి.. ఫైర్ అవుతున్న తెలుగు నెటిజన్లు..

నేడు కాంతార చాప్టర్ 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో పెట్టగా ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. (Rishab Shetty)

Rishab Shetty

Rishab Shetty : మన తెలుగు వాళ్ళం అన్ని సినీ పరిశ్రమల సినిమాలని ఎంకరేజ్ చేస్తాం. ఒక్కోసారి మన తెలుగు సినిమాల కంటే వేరే భాషల సినిమాలనే ఇక్కడ పెద్ద హిట్ చేస్తాం. కానీ వేరే భాషల్లో మన తెలుగు సినిమాలను కనీసం పట్టించుకోరు. ఇటీవల కర్ణాటకలో మన తెలుగు సినిమాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2, హరిహర వీరమల్లు, OG.. ఇలా చాలా సినిమాలను కర్ణాటకలో అడ్డుకొని, తెలుగులో టైటిల్స్ ఉన్నాయని, తెలుగు సినిమాలు అని గొడవలు చేసారు.(Rishab Shetty)

ఆ గొడవలపై మన తెలుగు సెలబ్రిటీలు కానీ, కన్నడ సెలబ్రిటీలు కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఈ విషయంపై తెలుగు సినిమా లవర్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ OG సినిమాకు కూడా ఇలాగే చేయడంతో మరింత ఫైర్ అవుతున్నారు. దీంతో వీళ్ళ కోపం త్వరలో రిలీజ్ కాబోతున్న కాంతార చాప్టర్ 1 సినిమాపై చూపిస్తున్నారు. ట్విట్టర్లో, యూట్యూబ్ కామెంట్స్ లో బాయ్ కాట్ కాంతార అంటూ నిన్నటి నుంచి ట్రెండ్ చేసారు.

Also Read : NTR Neel : గాయంతోనే వచ్చిన ఎన్టీఆర్.. నీల్ – ఎన్టీఆర్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

అయితే నేడు కాంతార చాప్టర్ 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో పెట్టగా ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పూర్తిగా కన్నడలోనే మాట్లాడాడు. కనీసం ఇంగ్లీష్ లో కూడా మాట్లాడలేదు. ఆ కన్నడ స్పీచ్ ఈవెంట్ కి వెళ్లిన ప్రేక్షకులకు, బయట ఆడియన్స్ కి ఎవరికీ అర్ధం కాలేదు. దీంతో నెటిజన్లు రిషబ్ మీద మరింత ఫైర్ అవుతున్నారు. అసలే బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంటే తెలుగు పరిశ్రమకు వచ్చి కన్నడలో మాట్లాడటంతో నెటిజన్లు రిషబ్ పై ఫైర్ అవుతున్నారు.

గతంలో మన మంగ్లీ తెలుగులో పాటలు పాడిందని కర్ణాటకలో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ మా తెలుగు సినిమాలని కనీసం ఆడనివ్వరు, మీరేమో ఇక్కడ తెలుగులో సినిమాలు రిలీజ్ చేస్తారు, కనీసం ఇంగ్లీష్ లో కూడా మాట్లాడారు, వచ్చి కన్నడలో మాట్లాడతారు. ఎవరైనా మేము అక్కడికి వచ్చి తెలుగు మాట్లాడితే తిడతారు, మీరు ఇలా చేయొచ్చా అంటూ రిషబ్ శెట్టి స్పీచ్ వీడియోల కింద కామెంట్స్ లో ఫైర్ అవుతున్నారు తెలుగు సినిమా లవర్స్. ఇలా గొడవలు జరుగుతున్నాయి అని తెలిసి కూడా రిషబ్ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై రిషబ్ తర్వాత ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

ఈయన కంటే ముంబై హీరోయిన్స్ వంద రేట్లు బెటర్ అంటున్నారు. హీరోయిన్స్ కనీసం అందరికి నమస్కారం అని తెలుగులో చెప్పి, తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ట్రై చేసి తెలుగు నేర్చుకుంటాం అని చెప్తారు.

కాంతార చాప్టర్ 1 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి కన్నడ స్పీచ్ మీరు కూడా చూసేయండి..

Also Read : NTR : కొంచెం నొప్పిగా ఉంది.. మా అమ్మమ్మ చెప్పిన కథలే ఈ సినిమా.. గాయంతోనే ఎన్టీఆర్ స్పీచ్..

రిషబ్ మాట్లాడిన దానికి తెలుగు అర్ధం.. అందరికి నమస్కారం. మీ అందరి ప్రేమకు, సపోర్టుకి ధన్యవాదాలు. ఈ వేడుక వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. ఎన్టీఆర్ గారు నాకు ఫ్రెండు, బ్రదర్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బ్రదర్ తో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ వేడుక హైదరాబాదులో జరుపుకోవడం, ఈ వేడుకకు ఎన్టీఆర్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఆడియన్స్ కి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకి వచ్చిన ఎన్టీఆర్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి మీరందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.