Chhatrapati Shivaji Maharaj first look
కాంతార మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న మూవీల్లో ‘ది ప్రైడ్ అఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే మూవీ ఒకటి. ఈ చిత్రంలో ఆయన ఛత్రపతి శివాజీగా కనిపించనున్నారు. సందీప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఓ చేతిలో ఖడ్గం పట్టుకుని ఓ వైపు సీరియస్‌గా చూస్తున్నట్లుగా ఉన్న రిషబ్ శెట్టి పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
Pushpa 2 : పాటల్లోనూ పుష్ప ప్రభంజనం.. అప్పుడలా.. ఇప్పుడిలా..
అంతేకాదండోయ్ ఈ చిత్ర విడుదల తేదీని సైతం ప్రకటించారు. 2027 జనవరి 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా వెల్లడించారు.
Pushpa 2 : పుష్ప ఈవెంట్ లో సుక్కు భార్య కంటతడి.. భర్త సక్సెస్ చూసి..
శివాజీ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే.. ఈ సినిమా మాత్రం నెవర్ బిఫోర్ తరహాలో ఉంటుందని ముంబై రిపోర్ట్. ఈ చిత్రంతో పాటు రిషబ్ శెట్టి ‘కాంతార 2’, ‘జై హనుమాన్’ మూవీల్లో నటిస్తున్నారు. ఇందులో ‘కాంతార 2’ చిత్రం 2025లో ‘జై హనుమాన్’ 2026లో విడుదల కానున్నాయి.
Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharaj
This isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q
— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024