Guppedantha Manasu
ఎన్ని కష్టాలు ఎదురైనా వసుధర చేయి వదలద్దని రిషి నుంచి మాట తీసుకుంటాడు మహేంద్ర. రిషి వసుధరకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?
Kamal Haasan : విజయవాడలో హీరో కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్..
విశ్వనాథం ఇంటి నుంచి రిషి, వసుధరలు కారులో వస్తుంటారు. వసుధర సైలెంట్‌గా ఉండటం చూసి రిషి ఏమైందని అడుగుతాడు. తన తల్లి జగతి చనిపోయిందన్న విషయం ఏంజెల్‌కి ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు. అవునని అంటుంది వసుధర. మన ప్రేమ, పెళ్లి విషయం చెబితేనే ఏంజెల్ నమ్మలేదు.. తన ప్రాణాలు కాపాడటం కోసం జగతి ఎలా చనిపోయిందో చెప్పాక కూడా ఏంజెల్ నమ్మకపోతే తనకి మరింత బాధ కలిగిస్తుందని అందుకే చెప్పలేదని అంటాడు రిషి. వాళ్లిద్దరూ కారులో వెళ్తుంటే మధ్యలో పాండ్యన్‌ని చూసి ఆగుతారు. పాండ్యన్ విష్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇచ్చిన ఉత్తరాలు రిషికి ఇస్తాడు. రిషి వాటిని చూడకుండానే కారులో పెట్టమంటాడు. వసుధర కూడా వాటిని గమనించకుండానే కారులో పెడుతుంది.
Guppedantha Manasu Latest
రిషి, వసుధరలు ఇంటికి వచ్చేసరికి మహేంద్ర నిద్రపోతుంటాడు. తాగనని మాట ఇచ్చి కూడా తండ్రి డ్రింక్ చేసాడేమోనని రిషి అనుమానపడతాడు. మహేంద్ర తను తాగలేదని చెబుతాడు. వసుధరకి భోజనం తన రూమ్‌కి తీసుకుని రమ్మని చెబుతాడు. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పాలని ఉందంటూ జగతి గురించి రిషితో మాట్లాడతాడు మహేంద్ర. జగతికి తనకి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేకపోయినా 20 ఏళ్లు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెబుతాడు. రిషి తల్లిని ద్వేషిస్తుంటే తను ఎంతగా తట్టుకోలేకపోయాడో వివరిస్తాడు. భార్యను దూరం పెట్టి నరకం అనుభవించిన వ్యక్తిగా చెబుతున్నానని వసుధరని ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దని రిషికి చెబుతాడు. సమస్య వచ్చిన ప్రతిసారి రిషి ప్రేమ కోసం వసుధర ఎలాంటి కష్టాలు అనుభవించిందో గుర్తు చేస్తాడు. తండ్రి మాటలు విన్న మహేంద్ర వసుధరని ఎలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టనని ప్రామిస్ చేస్తాడు. వారిద్దరి మాటలు వింటూ వసుధర కన్నీరు పెట్టుకుంటుంది.
వంటింట్లో వసుధర కన్నీరు పెట్టుకుంటుంది. వెనుక నుంచి వచ్చిన రిషి కళ్లు మూసి చేతికి కన్నీరు తగలగానే ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు. కంట్లో నలుసు పడింది అని అబద్ధం చెబుతుంది వసుధర. నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చానని వసుధరకి ఇస్తాడు రిషి. అందమైన జుంకాలు చూసి సంబరపడుతుంది వసుధర. నీకు నచ్చుతాయో లేదో.. నాకు సెలక్షన్ సరిగా రాదంటాడు రిషి. అలా అంటే తనను భార్యగా సెలక్ట్ చేసుకోవడం సరి కాదనేగా అర్ధం అంటూ అలుగుతుంది వసుధర. రిషి వసుధరకి జుంకాలు పెడుతుండగా కింద పడిపడిపోతుంది. తనకి దొరికినా ఇవ్వకుండా ఆటపట్టిస్తాడు రిషి. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఆ తర్వాత ఏమైంది? నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రలో నటించిన గుప్పెడంత మనసు సీరియల్‌ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.