Kamal Haasan : విజయవాడలో హీరో కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్..

విజయవాడలో జరిగిన హీరో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్.

Kamal Haasan : విజయవాడలో హీరో కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్..

Kamal Haasan Unveiling the Hero Krishna Idol at vijayawada

Updated On : November 10, 2023 / 11:10 AM IST

Kamal Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి సినిమాల్లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్ ప్రస్తుతం విజయవాడ జరుగుతుంది. గత రెండు రోజులుగా దర్శకుడు.. కమల్ హాసన్ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ కూడా మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా కమల్ విజయవాడలో జరిగిన హీరో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గత ఏడాది నవంబర్ 15న చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన లేకున్నా ఆయన అభిమానులు మాత్రం తమ అభిమానాన్ని చూపించుకుండా ఉండలేకపోతున్నారు. కృష్ణ విగ్రహావిష్కరణలు చేస్తూ ఆయనను తమ మధ్య ఒక శిలా రూపంలో ఉంచుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇటీవల కృష్ణ స్వస్థలం బుర్రిపాలెం ఒక విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు తప్ప కృష్ణ కుటుంబసభ్యులంతా హాజరయ్యారు.

Also read : Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ సినిమాకి చిరంజీవి, అల్లు అర్జున్.. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసా..?

ఇక తాజాగా విజయవాడలోని కృష్ణ విగ్రహాన్ని కమల్ హాసన్ చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ లీడర్ దేవినేని అవినాష్ కూడా పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ పై సూపర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి లోకనాయకుడు ఆవిష్కరించిన ఆ సూపర్ స్టార్ విగ్రహం వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

విజయవాడ గురునానక్ కాలనీలో ఈ విగ్రహా ఏర్పాటు జరిగింది. ఇక విగ్రహావిష్కరణలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవ కార్యక్రమాల్లో కృష్ణ పేరు నిలబెడుతూ వస్తున్నారు. ఇక ఎప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషంగా ఉంది. నగర ప్రజల తరపున కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్‌కు కృష్ణ కుటుంబసభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు.