Rithu Chowdary : మా నాన్న చనిపోయినప్పుడు మేము ఏడుస్తుంటే డబ్బులు ఇవ్వాలి అని.. SRH నితీష్ రెడ్డి ఇంటర్వ్యూ చూసి..

తాజాగా ఇంటర్వ్యూలో రీతూ చౌదరి తన తండ్రిని తలుచుకుంటూ..

Photo Credits : Social Post TV Youtube

Rithu Chowdary : జబర్దస్త్, పలు టీవీ షోలు, సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలు మాట్లాడింది. ఈ క్రమంలో తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయింది. రీతూ చౌదరి తండ్రి రెండేళ్ల క్రితం మరణించారు.

తాజాగా ఇంటర్వ్యూలో రీతూ చౌదరి తన తండ్రిని తలుచుకుంటూ.. మా నాన్నని రోజూ ఏదో ఒక సమయంలో గుర్తుచేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాం. నా కార్ లోనే మా నాన్న శవం తీసుకెళ్ళాం. నేను కార్ లో ఉన్నప్పుడు మా నాన్న అక్కడే ఉన్నాడు అని మాట్లాడతా. మా నాన్న చనిపోయాక ఓ 20 రోజుల వరకు నేను, మా అమ్మ, అన్నయ్య ఏం తినలేదు. మా నాన్న చనిపోయినప్పుడు మేము ఏడుస్తుంటే మా చుట్టాలు కొంతమంది వచ్చి నవ్వుకున్నారు. మీ నాన్న మాకు డబ్బులు ఇవ్వాలి అని అడిగారు. కొంతమంది నాన్న సైడ్ చుట్టాలు చాలా దారుణంగా బిహేవ్ చేసారు. ఊళ్ళో మా నాన్న ఇంట్లో ఉంటే అక్కడ తినడానికి కూడా మమ్మల్ని డబ్బులు అడిగారు. మా బాబాయ్ వాళ్ళు మా నాన్న పొలం తీసేసుకుంటే వెళ్లి కూర్చొని మాట్లాడుకొని తీసుకున్నాం. మా దగ్గర డబ్బులు లేక మా నాన్న పొలం అమ్ముకున్నాం అంటూ ఎమోషనల్ అయింది.

Also Read : Rithu Chowdary : రీతూ చౌదరి పేరు ఎందుకు మార్చుకుంది? ఎప్పుడు మార్చుకుంది? అసలు పేరేంటో తెలుసా?

అలాగే.. SRH నితీష్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నేను, మా అమ్మ ఏడుస్తూనే ఉన్నాం. నితీష్ వాళ్ళ నాన్న అంత చేసాడు అని గొప్పగా చెప్తుంటే నాకు ఏడుపొచ్చింది. మా నాన్న కూడా మాకు చేసాడు కానీ ఇప్పుడు మా పక్కన లేడేంటి అని ఏడ్చాము అంటూ ఎమోషనల్ అయింది రీతూ చౌదరి.