Rithu Chowdary : రీతూ చౌదరి పేరు ఎందుకు మార్చుకుంది? ఎప్పుడు మార్చుకుంది? అసలు పేరేంటో తెలుసా?

తాజాగా రీతూ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన అసలు పేరు గురించి చెప్పి ఎందుకు మార్చుకుందో తెలిపింది.

Rithu Chowdary : రీతూ చౌదరి పేరు ఎందుకు మార్చుకుంది? ఎప్పుడు మార్చుకుంది? అసలు పేరేంటో తెలుసా?

Do You Know Actress Rithu Chowdary Real Name

Updated On : April 28, 2025 / 4:32 PM IST

Rithu Chowdary : సీరియల్స్, జబర్డస్త్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి ప్రస్తుతం ప్రస్తుతం పలు టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలతో ఫామ్ లో ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి వైరల్ అవుతుంది. అయితే రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య అని కొన్ని రోజుల క్రితం ఓ ల్యాండ్ స్కామ్ లో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు బయటకు వచ్చింది.

తాజాగా రీతూ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన అసలు పేరు గురించి చెప్పి ఎందుకు మార్చుకుందో తెలిపింది.

Also Read : Rithu Chowdary : 700 కోట్ల స్కామ్ పై ‘రీతూ చౌదరి’ కామెంట్స్.. YS జగన్ పేరుని ప్రస్తావిస్తూ..

రీతూ చౌదరి మాట్లాడుతూ.. నా అసలు పేరు వనం దివ్య. స్కూల్ లో 8వ తరగతిలో ఉన్నప్పుడే రీతూ చౌదరిగా మార్చుకున్నాను. కానీ ఆధార్ లో, అధికారికంగా అన్నిట్లో వనం దివ్య అనే ఉంటుంది. దివ్య అనేది చాలా కామన్ పేరు. మా స్కూల్ లో చాలా మంది దివ్య లు ఉన్నారు. మా క్లాస్ లోనే ఆరుగురు ఉండేవాళ్ళు. దివ్య అని పిలిస్తే ఆరుగురు పలికేవాళ్ళం. దాంతో నాకు చిరాకు వచ్చి మా అమ్మని పేరు మార్చమని అడిగాను. మా అమ్మ ఓ రెండు రోజులు ఆలోచించి రీతూ అనే పేరు పెట్టింది అని తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)